వెంకటాచలంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీని దేశభక్తి ఉట్టిపడేలా ఘనంగా నిర్వహించారు

 

నెల్లూరు, ఆగస్ట్ 1 (ప్రజా అమరావతి): ఆజాదికా అమృత్ మహోత్సవాల్లో భాగంగా వెంకటాచలంలో  హర్ ఘర్ తిరంగా ర్యాలీని దేశభక్తి ఉట్టిపడేలా ఘనంగా నిర్వహించారు


. సోమవారం ఉదయం వెంకటాచలం మండల పరిషత్ కార్యాలయ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ ర్యాలీని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. స్థానిక జడ్పీ హైస్కూల్ విద్యార్థుల దేశభక్తి నినాదాలు, కేరింతల మధ్య ర్యాలీ ఉత్సాహంగా కొనసాగింది. ఈ సందర్భంగా చిన్నారుల స్వాతంత్ర సమరయోధుల వేషధారణలు అందరినీ ఆకట్టుకోగా, మంత్రి ప్రత్యేకంగా చిన్నారులతో ఫొటో దిగి అభినందించారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 వసంతాలు పూర్తిచేసుకున్న సందరమనగా ఆగస్టు ఒకటి నుంచి 15వ తేదీ వరకు ఆజాదికా అమృత్ మహోత్సవాల్లో భాగంగా  అనేక కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరిలో దేశభక్తి పెంపొందేలా, జాతీయ పతాకం పట్ల అవగాహన కలిగేలా భారీ జాతీయ జెండా ప్రదర్శనతో ఈ ర్యాలీని నిర్వహించారు. 

 ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి శ్రీ సాంబశివారెడ్డి, ఎంపీడీవో శ్రీమతి సుస్మిత, ఎంపీపీ కవిత, జెడ్పీటీసీ మణి, వైస్ ఎంపీపీ కోదండరామిరెడ్డి, జడ్పీ హైస్కూల్ హెచ్ఎం శ్రీమతి లత, ఉపాధ్యాయులు నజీర్ బాషా, అంతూరి దేవి, సుధారాణి, సుబ్బమ్మ, సచివాలయ సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. 


Comments