ఒక రాజకీయ పార్టీ కార్యక్రమం చేసుకుంటే మరో పార్టీ వారు అక్కడికి రారు

 చిత్తూరు (ప్రజా అమరావతి);


*రామకుప్పం లో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రసంగం:-*


ఒక రాజకీయ పార్టీ కార్యక్రమం చేసుకుంటే మరో పార్టీ వారు అక్కడికి రారు.


కానీ ఈ సారి ఆ కనీస ఇంగితం లేకుండా కొందరు  పోలీసులు వ్యవహరించారు.


కుప్పం లో నా పర్యటనకు ఇబ్బందులు సృష్టించే ప్రయత్నించారు.


వీళ్ళ బెదిరింపులకు మనం భయపడతమా?


టీడీపీ కార్యకర్తల పై దాడి చేసిందే కాకుండా మళ్ళీ రేపు కేసులు కూడా పెడతారు.


ఇలాంటి ఘటనలతో టీడీపీ ని కట్టడి చెయ్యలేరు.


పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలు చేసి పైశాచిక ఆనందం పొందారు.


జగన్ ఈ సారి కుప్పం కూడా గెలవడం కాదు...ముందు పులివెందుల గెలవాలి.


ఎంపీ డర్టీ వీడియో పై సీఎం ఎందుకు చర్యలు తీసుకోలేదు.


జగన్ భయపడినట్లు నాకు అనిపిస్తుంది. దైర్యం లేని బలహీనమైన సీఎం జగన్ అని అర్థం అవ్తుంది


జగన్ పాలనలో మూడున్నర ఏళ్లుగా ఒక్క ఉద్యోగం లేదు...ఒక్క పరిశ్రమ లేదు.


ఆంధ్ర అంటే ఇప్పుడు పెట్టుబడులకు ఎవరూ ముందుకు రావడం లేదు.


ఆంక్షలతో గొప్పగా చెప్పిన అమ్మఒడి కి కోతలు.


నాడు నేడు అని చెప్పి ఇప్పుడు స్కూల్స్ విలీనం చేస్తున్నారు.


దీనివల్ల పిల్లలు చదువులకు దూరం అయ్యే పరిస్థితి వచ్చింది


పొరుగు రాష్ట్రం నుంచి మద్యం తెచ్చి వైసీపీ నేతలు ఇక్కడ అమ్ముతున్నారు.


జగన్ ఇంటికి 10 వేలు ఇచ్చి లక్ష రూపాయలు దొస్తున్నాడు


J brands తో జగన్ దొచేస్తున్నాడు.


ఢిల్లీ లిక్కర్ స్కాం కంటే పెద్ద స్కాం j బ్రాండ్స్ ద్వారా AP లో జరుగుతుంది.


రాష్ట్రం లో సిమెంట్, ఇసుక రేట్ల వల్ల జనం పై భారం


జగన్ ఒక కరుడు గట్టిన ఆర్థిక ఉగ్రవాది.


నాడు కమిషన్ లు తీసుకున్న కంపెనీల ను పూర్తిగా హస్తగతం చేసుకుంటున్నాడు.


లేపాక్షి హబ్ దివాలా తీసింది అని ఇప్పుడు 500 కోట్లు ఇచ్చి వేల కోట్ల భూమి కొట్టేస్తున్నడు.


20 కోట్ల టర్నోవర్ ఉన్న చిన్న కంపెనీ కంపెనీ 500 కోట్లు పెట్టీ 20 వేల కోట్లు కొట్టేస్తుంది.


లేపాక్షి అవ్వగానే... వాన్పిక్ ప్రాజెక్ట్ పై పడతారు.


రామకుప్పం లో ఇంటి జాగాకు డబ్బులు వసూలు చేశారు.


వైసీపీ వచ్చాక కుప్పం నియోజకవర్గం అభివృద్ధి పూర్తిగా నిలిపివేశారు.


కుప్పం కు అన్ని రద్దు చేసి..ఇప్పుడు 60 కోట్లు ఇస్తాను అంటున్నాడు.


కుప్పం పై కోపం ఎందుకు? కక్ష ఎందుకు?


కుప్పం లో నాడు ఆవులు పంపిణీ చెయ్యడం వల్ల ప్రజల ఆదాయం పెరిగింది.


ఇప్పుడు బలవంతం గా అమూల్ కు పాలు పోయాలని వొత్తిడి చేస్తున్నారు.


పుంగనూరు లో పెద్ది రెడ్డి డైరీ లో లీటరు పాలకు 18 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు.


మనం ప్రశ్నించిన తరువాత రేటు పెంచారు.


టీడీపీ వేస్తే సంక్షేమం ఉండదు అని ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు.


టీడీపీ ఇలా అప్పులు చెయ్యదు...దీనికంటే మిన్నగా అభివృద్ధి, సంక్షేమం చేస్తాం.

Comments