వినాయకచవితి పండుగ, నిమజ్జన ఏర్పాట్లను భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అత్యంత పకడ్బందీగా నిర్వహించాలి


నెల్లూరు ఆగస్టు 18 (ప్రజా అమరావతి);


ప్రజలంతా సామూహికంగా చేసుకునే   వినాయకచవితి పండుగ, నిమజ్జన ఏర్పాట్లను భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అత్యంత పకడ్బందీగా నిర్వహించాల


ని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ & పుడ్ ప్రాసెసింగ్ శాఖామాత్యులు  శ్రీ కాకాణి గోవర్ధన రెడ్డి అధికారులను ఆదేశించారు. 


గురువారం సాయంత్రం నగర పాలక సంస్థ కార్యాలయంలో వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జన ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. నెల్లూరు రూరల్ శాసన సభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి కాకాణి మాట్లాడుతూ 

ప్రతీ సంవత్సరం నిమజ్జనం నిర్వహించే పెన్నా నదిలో కాకుండా ఈసారి ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సమీపంలో స్వర్ణాల చెరువు  లో నిమజ్జన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వినాయక విగ్రహలు ఏర్పాటు చేసే నిర్వాహకులందరూ ఈ మార్పును గమనించాలని మంత్రి కోరారు. అదేవిధంగా విగ్రహ ఏర్పాట్లకు, మైక్ పర్మిషన్ కు పోలీస్ అనుమతులు తప్పనిసరన్నారు. విగ్రహ మండపాల వద్ద, నిమజ్జన ప్రదేశంలో నిరంతర విద్యుత్ కు చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులను కోరారు. స్వర్ణాల చెరువులో గుర్రపు డెక్కను తోలగించి, ఆయా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. నగరం నుండి నిమజ్జనానికి వచ్చే రహదార్ల రూట్ మ్యాప్ ను సిద్దం చేసుకుని, ఆయా రహదార్ల లో  తక్కువ ఎత్తులో ఉండే విద్యుత్ తీగల విషయంలో జాగ్రత్తలు వహించాలన్నారు. అదేవిధంగా సిసి కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. గజ ఈతగాళ్ళు, బోటులను సంసిద్ధంగా ఉంచుకోవలసిందిగా సంబంధిత అధికారులకు సూచించారు. నిమజ్జనం జరిగే స్వర్ణాల చెరువులో తగినంత నీటి నిల్వలు ఉండేలా జాగ్రత్తలు వహించాలని ఇరిగేషన్ అధికారులకు మంత్రి సూచించారు.


ఈ సమీక్షా సమావేశానికి విచ్చేసిన రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలను ప్రతి ఒక్కరూ ఎటువంటి భేషజాలకు పోకుండా, సమిష్టిగా కృషిచేసి విజయవంతం చేయాలన్నారు. ఉత్సవ ఏర్పాట్లకుగాను తమ వంతు సాయంగా ఎం పి లాడ్స్ నిధుల నుండి 25 లక్షల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. 


నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలు సంతోషంగా, ఘనంగా నిర్వహించేందుకు గాను విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ కమిటీ కి తోడ్పాటుగా నిమజ్జన కమిటీ ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.  అత్యంత భక్తి శ్రద్ధలతో అట్టహాసంగా,  కోలాహలంగా నిమజ్జన ఏర్పాట్లు చేస్తామన్నారు. సమీక్షా సమావేశం నిర్వహించడమే కాకుండా అధికారులకు పనులు ప్రారంభించేందుకు స్పష్టమైన ఆదేశాలిచ్చిన మంత్రి కాకాణికి తమ ధన్యవాదాలన్నారు.


ఈ సమీక్షా సమావేశంలో పాల్గోన్న నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాల నిర్వహణకు నుడా నిధుల నుండి 20 లక్షల రూపాయల నిధులను మంజూరు చేస్తామన్నారు. 


  ఈ సమీక్షా సమావేశంలో మేయర్ పొట్లూరి స్రవంతి, డిప్యూటీ మేయర్లు రూప్ కుమార్ యాదవ్, ఖలీల్ అహ్మద్, జిల్లా ఎస్పి విజయ రావు, జాయింట్ కలెక్టర్ రోణంకి కూర్మనాథ్, నగరపాలక సంస్థ కమిషనర్ హరిత, ఆర్డీవో మలోల, విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

 



Comments