తిరుమల శ్రీవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రిని మరింతగా అనుగ్రహించమని కోరుకున్నా: సమాచార శాఖ మంత్రి.

 


తిరుమల శ్రీవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రిని మరింతగా అనుగ్రహించమని కోరుకున్నా: సమాచార శాఖ మంత్రి.


తిరుమల, ఆగస్ట్23 (ప్రజా అమరావతి)


: తిరుమల శ్రీవారిని ప్రాతః కాల సేవలో స్వామి వారిని సేవించి దర్శించుకున్న రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ, సినిమాటోగ్రఫీ మరియు వెనుక బడిన తరగతుల శాఖా మంత్రి వర్యులు శ్రీ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ.


స్వామి వారి దర్శన అనంతరం ఆలయ వెలుపల మీడియా తో మంత్రి మాట్లాడుతూ ముందుగా ఓం నమో వెంకటేశాయ వెంకటాద్రి సమస్తానం బ్రహ్మాణ్డె నాస్తి కించనః వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని స్వామి వారిని స్మరిస్తూ ఈ రోజు పెరుమాల్ని స్వామివారిని ప్రాతఃకాల సేవలో సేవించి, తాను ప్రధానంగా వేడుకున్నది కోరుకున్నది ఏమంటే  ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కొరకు యాగం తలపెట్టి ప్రజా సంక్షేమం కోసం పాటు పడుతున్న వై యస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మరింత అనుగ్రహించమని కోరుకున్నానని అన్నారు. ముఖ్యమంత్రి ఆలోచన ఎప్పుడూ కూడా పేదరికంలో మగ్గుతున్న  ప్రజలు, పలు సమస్యలతో బాధపడుతున్న వారి జీవితాల్లో ఒక మంచి మార్పు తీసుకురావాలని  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో  పేద వారు పేదరికం నుండి బయట పడాలని తపనతో అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్న మనసున్న ముఖ్యమంత్రి అని, కొనియాడారు. వీటి ఫలితంగా ప్రజలు సుస్థిరమైన జీవనాన్ని సాగించే దిశగా పాలన అందిస్తున్నారు అన్నారు. దుష్ట శక్తుల పాలనలో పేదవారి ఎదుగుదల సహించని వారు పేద వారి ఉన్నతిని ఓర్వలేక పేదవారిని అలాగే ఉండేలా చేశారని అన్నారు. దుష్ట శక్తుల నుండి జగన్మోహన్ రెడ్డి ని రక్షించమని కోరుకున్నట్లు తెలిపారు.  స్వామి వారి ఆశీస్సులతో  పాలకుడైనటువంటి జగన్ మోహన్ రెడ్డి గారిని మరింతగా అనుగ్రహించమని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగించమని, ఇప్పటికే సకాలంలో వర్షాలు పడి నదులు చెరువులు నిండి రైతులు సుభిక్షంగా తన పంటలు వేసుకుని ఆనంద పడుతున్న  ఇటువంటి తరుణంలో, విపరీతమైన విపత్తులు రాకుండా చల్లగా చూడమని,  ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద స్వామి వారి సంపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదించమని స్వామి వారిని వేడుకున్నానని తెలిపారు.


Comments
Popular posts
అర్హులైన వారందరికీ వర్తించేలా వైయస్సార్‌ కళ్యాణమస్తు, వైయస్సార్‌ షాదీ తోఫా.
Image
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆరవ రోజున శ్రీ కనకదుర్గమ్మ వారు శ్రీ మహాలక్ష్మి గా దర్శనమిస్తారు.
Image
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఏడవ రోజున శ్రీ కనక దుర్గమ్మ వారు శ్రీ సరస్వతి దేవి అలంకారంలో దర్శనం ఇస్తారు.
Image
అక్టోబరు 25న ఇ–క్రాపింగ్‌ జాబితాలు సచివాలయాల్లో ప్రదర్శన, షెడ్యూల్‌ వివరించిన సీఎం.
Image
భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రిని కోరిన ముఖ్యమంత్రి.
Image