నెల్లూరు (ప్రజా అమరావతి);
సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని అన్నీ గ్రామాల్లో మౌలిక వసతులతో పాటు అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సమగ్రంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు
చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
శుక్రవారం సాయంత్రం సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని, ముత్తుకూరు మండలం ఈపూరు పట్టపుపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని దొరువులపాలెంలో రెండవ రోజు చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా
రూ.40లక్షలతో నిర్మించిన సచివాలయ భవనాన్ని, రూ.21.80 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని, రూ.17.50 లక్షలతో నిర్మించిన వై.ఎస్.ఆర్ హెల్త్ క్లినిక్ భవనాన్ని మంత్రి ప్రారంభించారు.
అనంతరం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డికి పెద్ద ఎత్తున మహిళలు, అభిమానులు, ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. మంత్రి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు గురించి వివరిస్తూ, వారి సమస్యలు తెలుసుకుంటూ, వారు పొందుతున్న లబ్ధి సమాచారంతో కూడిన బుక్ లెట్‌ను అందజేశారు.
ఈ సంధర్బంగా మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇదే గ్రామంలో నిన్న మొదటి రోజు పర్యటించినప్పుడు గ్రామస్తులు కొన్ని సమస్యలను తెలపడం జరిగిందని, సమస్యల పరిష్కారంలో భాగంగా ఇద్దరికీ గ్యాస్ సిలిండర్లు, రెండు సంవత్సరాల నుండి పెండింగ్లో వున్న జనన ధ్రువీకరణ పత్రాన్ని, ట్రై సైకిళ్లను 24 గంటల్లో ఇవ్వడం జరిగిందని మంత్రి తెలిపారు. గ్రామాల్లో పర్యటిస్తున్న సమయంలో ప్రజలు తెలుపుతున్న సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని ఎస్.టి కుటుంబాలకు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం 1.80 లక్షల రూపాయలు మంజూరు చేస్తుండగా, సి.ఎస్.ఆర్ నిధుల నుండి మరో 15 వేల రూపాయలు ఎస్.టి గృహ నిర్మాణ లబ్ధిదారులకు ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతి గ్రామంలో సంక్షేమ కార్యక్రమాల అమలు పట్ల ప్రజలు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియచేస్తూ సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని మంత్రి వివరించారు. ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లను వేయడంతో పాటు గ్రామాలను మరింతగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్టుకు మంత్రి తెలిపారు.
మంత్రి వెంట ఎంపిపి శ్రీమతి సుగుణమ్మ, జిల్లా వ్యవసాయ శాఖాధికారి శ్రీ సుధాకర్ రాజు, తహశీల్దార్ శ్రీ మనోహర్ బాబు, ఎంపిడిఓ శ్రీమతి ప్రత్యూష, వివిధ శాఖల మండల అధికారులు, ప్రజా ప్రతినిధిలు, వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment