సర్వేపల్లి నియోజకవర్గం లోని ప్రజల ప్రతి సమస్యను తన స్వంత సమస్యగా భావించి పరిష్కారిస్తాను

 

నెల్లూరు  ఆగస్టు 16 (ప్రజా అమరావతి);


సర్వేపల్లి నియోజకవర్గం లోని ప్రజల ప్రతి సమస్యను తన స్వంత సమస్యగా భావించి పరిష్కారిస్తానని


రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ & పుడ్ ప్రాసెసింగ్ శాఖామాత్యులు శ్రీ కాకాణి గోవర్ధన రెడ్డి అన్నారు. 


మంగళవారం సాయంత్రం సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం ఈపూరు గ్రామంలో గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించిన మంత్రి ఇంటింటికీ వెళ్ళి సంక్షేమ ఫలాలు అందుతున్న తీరు గురించి తెలుసుకున్నారు. గడపగడప లో మంత్రికి హారతులతో  స్వాగతం పలికి బ్రహ్మరథం పట్టారు. తొలుత ఈపూరు గ్రామ సచివాలయ ఆవరణలో  డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.  


ఈ సందర్భంగా మంత్రి కాకాణి  మీడియాతో మాట్లాడుతూ, దోరువులపాలెం సచివాలయ పరిధిలో మూడు రోజులుగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, చివరిగా నాలుగోరోజు ఈపూరు గ్రామంలో నిర్వహించామని, ఏ గడప కెళ్ళినా ప్రజలు ఆదరణ అపూర్వమన్నారు. దాదాపు 90 శాతం పైగా ప్రజలు సంక్షేమ పధకాలు సమగ్రంగా, సంపూర్ణంగా అందుతున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా నిర్వహిస్తున్న గడప గడప కు మన ప్రభుత్వం  కార్యక్రమంలో ప్రతి కుటుంబాన్ని పలకరించి, వారి సాదక భాధకాలు తెలుసుకుంటున్నామని, ప్రజలు కోరుతున్న ట్రై సైకిల్స్ , గ్యాస్ కనెక్షన్స్ వంటి  చిన్న చిన్న సమస్యలను తక్షణమే పరిష్కరిస్తున్నామన్నారు. గ్రామాలకు సంబంధించి ప్రజలు కోరుకుంటున్న అభివృద్ధి పనుల వివరాలను నమోదు చేసుకున్నామని, వాటి పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకుంటామన్నారు.   


ఈ కార్యక్రమంలో యం పి పి జి. సుగుణ, ఎంపీడీవో ప్రత్యూష, తాహసిల్దార్ మనోహర్ బాబు, వ్యవసాయ అధికారి జోస్నా రాణి, ఈపూరు గ్రామ సర్పంచ్ అనంత రాజు సాయి శశిధర్, వై ఎస్ ఆర్ సి పి నాయకులు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.



Comments