నేతన్న నేస్తం పేరుతో చేనేతలకు జగన్ రెడ్డి శఠగోపం
కన్యాశుల్కం గిరీశంని మించిపోతున్న జగన్ రెడ్డి దగా రాజకీయం
- పంచుమర్తి అనురాధ
దగా, మోసం, అబద్దాలు ప్రచారం చేయడం, ఆడంబరాలకు పోవడంలో కన్యాశుల్కం కథలోని గిరీశంని జగన్ రెడ్డి మించిపోతున్నారు. స్వాతంత్ర్యం వచ్చాక చేనేతలకు ఏ ముఖ్యమంత్రీ చేయనంతటి దగా జగన్ రెడ్డి చేశారు. బటన్ నొక్కి డబ్బు జమ చేసేస్తున్నా అని చెప్పుకోవడమంటే... తాంబూళం ఇచ్చేశా తన్నుకు చావండి అన్నట్లుంది. నగదు బదిలీ పేరుతో బటన్ నొక్కుతున్న జగన్ రెడ్డి.. ఎంత మంది ఖాతాల్లో నగదు జమ అవుతుందో సమాధానం చెప్పగలరా.? గతేడాది 82వేల మంది చేనేతల ఖాతాల్లో డబ్బు వేస్తున్నా అంటూ బటన్ నొక్కితే కేవలం 69వేల మంది ఖాతాల్లోనే డబ్బు జమ అయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మరి మిగిలిన 13 వేల మంది పరిస్థితి ఏంటో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి.
చేనేతలు కార్మికులు మగ్గం మరమ్మతులు, కొత్త మగ్గాల కొనుగోలు కోసం గతంలో కార్పొరేషన్ ద్వారా రూ.2లక్షల రుణాలిస్తే రద్దు చేశారు. పావలా వడ్డీకే రుణాలు పథకాన్ని రద్దు చేశారు. త్రిఫ్టు పథకాన్ని ఎత్తేశారు. ఆదరణ ద్వారా పరికరాల పంపిణీ నిలిపేశారు. సిల్క్ కొనుగోలుపై రాయితీ రద్దు చేశారు. చివరికి కార్మికులకు ఆరోగ్య బీమా, మరణించిన కార్మికులకు పరిహారమూ రద్దు చేశారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం 90 శాతం సబ్సడీతో అందించే NHDP పథకాలకు రాష్ట్ర వాటా చెల్లించకుండా ఆ ప్రయోజనాలూ చేనేతలకు అందకుండా చేశారు. చివరికి స్కూల్ యూనిఫాం కొనుగోళ్లకు సంబంధించిన బైలాస్ కూడా అడ్డగోలుగా మార్చి చేనేతల నుండి కొనుగోలు చేయకుండా కార్పొరేట్స్ కు కట్టబెట్టారు. ఆప్కో ద్వారా కొనుగోళ్లు నిలిపేశారు. చేనేతలకు జగన్ రెడ్డి చేసిన దగా మొత్తానికి మరోవైపు సామాజిక న్యాయం అనే మాటలు వింటుంటే జగన్ రెడ్డిలో చిన్నప్పుడు చదివిన గిరీశం మాత్రమే కనిపిస్తున్నాడు. సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్న జగన్ రెడ్డితో చర్చకు తెలుగుదేశం పార్టీ సిద్ధం. జగన్ రెడ్డి సహా.. వైసీపీ నేతల్లో ఎవరు వచ్చినా మేం చర్చిస్తాం. బీసీలను దగా చేసిన ఏకైక వ్యక్తి జగన్ రెడ్డి అనే విషయం ప్రజలంతా గుర్తించారని తెలుసుకోవాలి. జగన్ రెడ్డి బీసీల గురించి ఎంత అరిచినా వచ్చే ఎన్నికల్లో తాట తీయడం ఖాయమని గుర్తుంచుకోవాలి.
addComments
Post a Comment