పురాతన మసీదులు, చర్చిల వద్ద జెండా పండుగవిజయవాడ: ఆగస్టు 12 (ప్రజా అమరావతి);


పురాతన మసీదులు, చర్చిల వద్ద జెండా పండుగ


ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా వారసత్వపు కట్టడాలు, చారిత్రాత్మక మసీదుల నుంచి శుక్రవారం ప్రార్థనల అనంతరం ముస్లింలు జెండాలు చేతబట్టి నినాదాలిస్తూ ర్యాలీలు నిర్వహించారు. మైనార్టీ శాఖ సెక్రటరీ శ్రీ ఏ   ఎండి ఇంతియాజ్ ఇచ్చిన  పిలుపునందుకొని  శుక్రవారం ముస్లిమ్ లు , క్రిస్టియన్లు భారీ ఎత్తున జండా కార్యక్రమాలు  నిర్వహించారు. విజయనగరంలోని జామియా మసీదు అతి పురాతనమైన మసీదుగా పేరొందింది. మసీదు ఇమామ్, మౌజన్ నిర్వహణా కమిటీ సభ్యులు, ఇతర ముస్లిమ్లు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అలాగే ఏలూరులోని మదరసాలో విద్యార్ధులంతా కలసి జాతీయ జెండా ఎగురవేస్తూ ర్యాలీలు తీశారు. బాల బాలికలు ఉత్సాహంగా సమావేశంలో ,ర్యాలీ లో పాల్గొన్నారు..గుంటూరు జిల్లా, కృష్ణాజిల్లాలోని గూడూరులలో కూడా ప్రార్ధనకు వచ్చిన ముస్లింలు జాతీయ నినాదాలు చేస్తూ జాతీయ జెండాను రెపరెపలాడించడం, దేశభక్తిని చాటడం విశేషం. అలాగే కర్నూల్ లోని గుమ్మజ్ నుంచి ఉస్మానియా  కళాశాలల విద్యార్థులు జెండా పట్టుకుని నినాదాలిస్తూ ర్యాలీ చేపట్టారు. వారసత్వ కట్టడమైన గూమ్మజ్  నుంచి ర్యాలీ చేపట్టడం స్ఫూర్తి గా నిలిచింది. విజయనగరంలోని ఒక పురాతన చర్చిని  ఆధునీకరించారు. ఆ చర్చి నుంచి కూడా క్రైస్తవులు ర్యాలీ తీయడం ముదావహం . గుంటూరు లోని దారుస్సలం మద్రస విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.రాష్ట్ర వ్యాప్తంగా జెండాలు చేతబట్టి మసీదుల నుంచి ముస్లింలు, చర్చిల నుంచి క్రైస్తవులు ర్యాలీలు, సెల్ఫీలు తీసుకోవడం,ర్యాలీలు నిర్వహించడం వంటి జాతీయ భావాలు పెంపొందించే కార్యక్రమాలు చేపట్టారని మైనార్టీ సెక్రటరీ ఇంతియాజ్ చెప్పారు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఈ జెండా మహోత్సవం లో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని  పిలుపునిచ్చిన జెండా పండుగను ముస్లింలు, క్రిస్టియన్లు అందిపుచ్చుకొన్నారని ఆయన చెప్పారు.

Comments