శ్రీ కపిలేశ్వరాలయంలో ఘనంగా లక్ష కుంకుమార్చన
తిరుపతి, ఆగస్టు 26 (ప్రజా అమరావతి): తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రావణమాసంలో చివరి శుక్రవారం శ్రీ కామాక్షి అమ్మవారికి శాస్త్రోక్తంగా లక్ష కుంకుమార్చన నిర్వహించారు.
ఇందులో భాగంగా ఆలయంలోని మండపంలో శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు, శ్రీ సరస్వతి అమ్మవారు, శ్రీ కామాక్షి అమ్మవార్లను కొలువుదీర్చి కుంకుమార్చన నిర్వహించారు. ముందుగా కలశస్థాపన, గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశారాధన చేశారు. ఈ సందర్భంగా కుంకుమతో అమ్మవారికి అర్చన చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్ రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్రబాబు, ఏఈవో శ్రీ శ్రీనివాసులు, సూపరింటెండెంట్ శ్రీ భూపతి పాల్గొన్నారు.
addComments
Post a Comment