గూడూరు/పెడన/బంటుమిల్లి/ కృత్తివెన్ను, (ప్రజా అమరావతి);
" *కష్టంతో కాదు ఇష్టంతో రండి - సంక్షేమ సామ్రాట్ జగనన్న ను నిండు మనసులో దీవించండి
.*"
*- మంత్రి జోగి రమేష్.*
ఈనెల 25 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గం కేంద్రమైన పెడన పట్టణానికి నాలుగో విడత నేతన్న నేస్తం పథకం పంపిణీ కార్యక్రమానికి విచ్చేస్తున్న సందర్భంగా కార్యాచరణ ప్రణాళిక చర్చించడానికి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ జోగి రమేష్ గారు ఈరోజు నియోజకవర్గ పరిధిలోని 4 మండలాల్లో సుడిగాలి పర్యటన జరిపారు.
ఈ సందర్భంగా ఆయా మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు మరియు స్థానిక ప్రజలతో ఏర్పాటు చేసిన సమావేశాల్లో మంత్రి శ్రీ జోగి రమేష్ గారు మాట్లాడుతూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాల వల్ల ప్రతి ఒక్క కుటుంబం లబ్ధి పొందింది కాబట్టి ఎవరూ కష్టం అనుకోకుండా ఇష్టంతో సభకు రావాలని కోరారు.
అదే సమయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వల్ల పెడన నియోజకవర్గ అభివృద్ధి పనులు నిమిత్తం వరాల జల్లు కురిపించే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ పెద్ద సంఖ్యలో ఈ సభలో పాల్గొని విజయవంతం చేయాలని, నియోజకవర్గ అభివృద్ధికి మీ వంతు సహాయ సహకారాలు అందించాలని మంత్రి శ్రీ జోగి రమేష్ గారు విజ్ఞప్తి చేశారు.
పెడన నియోజకవర్గ చరిత్రలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు రాక ఎంతో ప్రాముఖ్యత కలిగిన విషయమని, సీఎం గారు పర్యటన సందర్భంగా మనకు అనేక ప్రగతికారక హామీలు లభించే అవకాశం ఉన్నందున ప్రజలందరూ తమ ఇంట్లో వేడుకలాగా భావించి ఈ కార్యక్రమానికి హాజరు కావాలని మంత్రి శ్రీ జోగి రమేష్ గారు తెలియజేశారు.
ఈ సమీక్ష సమావేశాల్లో నియోజకవర్గ పరిధిలోని గూడూరు, పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాలు మరియు పెడన పట్టణ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు,అధికారులు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు మరియు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు హాజరయ్యారు.
addComments
Post a Comment