శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
(ప్రజా అమరావతి): ఈరోజు అనగా ది.15-08-2022 న స్వాతంత్ర్య దినోత్సవ సందర్భముగా ఘాట్ రోడ్ లోని ఓం- టర్నింగ్ వద్ద దేవస్థానము వారు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమమునకు ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ గారు విచ్చేయగా ఆలయ సెక్యూరిటీ అధికారులు గౌరవ స్వాగతం పలికారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి వారు శ్రీ అమ్మవారి, భారతమాత, జాతిపిత మహాత్మాగాంధీ వారి చిత్ర పటాలకు ఆలయ అర్చకుల, వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య పూలు, పండ్లు సమర్పించి పూజలు నిర్వహించారు. అనంతరము ఆలయ కార్యనిర్వహణాధికారి వారు SPF సిబ్బంది, హోం గార్డ్స్ మరియు దేవస్థాన రక్షణ సిబ్బంది వారి గౌరవ వందనము అందుకుని, జెండా వందనము జేశారు. తదనంతరము స్వాతంత్ర దినోత్సవ విశిష్టత గురించి, స్వాతంత్రోద్యమ నాయకుల గొప్పదనం గురించి ప్రసంగించారు. అనంతరం చిన్నారులకు మరియు దేవస్థానము సిబ్బందికి, భక్తులకు కార్యనిర్వహణాధికారి వారు స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమములో ఆలయ వైదిక కమిటీ సభ్యులు, వేదపండితులు, వేద విద్యార్థులు, ఆలయ కార్యనిర్వాహక ఇంజినీరు వార్లు, సహాయ కార్యనిర్వహనాధికారులు, పొలిసు సిబ్బంది వారు, ఇంజినీరింగ్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది, మరియు ఇతర దేవస్థాన సిబ్బంది, భక్తులు వారు పాల్గొన్నారు.
addComments
Post a Comment