బాపట్ల (ప్రజా అమరావతి);
*జగనన్న విద్యా దీవెన*
*పూర్తి ఫీజు రీఇంబర్స్‌మెంట్ – క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లింపులు*
*ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రులు, లబ్ధిదారులు ఏమన్నారంటే...వారి మాటల్లోనే*
*మేరుగ నాగార్జున, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి*
అందరికీ నమస్కారం, బాపట్ల ప్రాంతం అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకున్న ప్రాంతం, అలాగే అనేకమంది ఉద్దండులైన శిష్యులను ఆయనకు ఇచ్చినటువంటి ప్రాంతం, ఆయన తనయుడు శ్రీ జగన్ గారి వెంట నడిచే ప్రజానీకం కోకొల్లలు, అలాంటి ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు, గౌరవం ఇచ్చిన సీఎంగారికి ధన్యవాదాలు. అంబేద్కర్ గారు ఒక మాట అనేవారు, జాతికి, దేశానికి సంఖ్యా బలమే సరిపోదు, చదువు అనేది చాలా ముఖ్యం, చదువుకున్న వ్యక్తి అత్యున్నత శిఖరాలకు వెళ్ళే ఆస్కారం ఉంటుంద
ని చెప్పిన మహనీయుడు ఆయన, అలాంటి ఆలోచనను ఏపీలో అమలుచేస్తున్న సీఎంగారిని మనం చూస్తున్నాం. వైఎస్సార్ గారి హయాంలో ఫీజు రీఇంబర్స్‌మెంట్ ప్రవేశపెడితే, ఇప్పుడు సీఎంగారు చదువుకి ప్రాధాన్యతనిస్తూ సమాజంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలకు ఒక భరోసా కల్పిస్తున్నారు. నేను చదువుకునే రోజుల్లో ఫీజులు కట్టలేక పరీక్షలు రాయలేని పిల్లల తల్లిదండ్రులు తెచ్చిన ఆ అప్పులు కట్టలేక ప్రాణాలు కోల్పోయేవారు. నాలాగే అనేకమంది మిత్రులు ఇదే పరిస్ధితి ఎదుర్కొన్నారు, కానీ ఆ పరిస్ధితులను రూపుమాపుతూ మీరు చదువుల విప్లవానికి నాంది పలికిన మహానుభావుడు మీరు. ఇదివరకు స్కూల్స్ ఎలా ఉండేవి, భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు మీలా ఆలోచించలేదు. గతంలో పాలించిన ముఖ్యమంత్రులు అనేక సామాజిక రుగ్మతలను తీసుకొచ్చారు. సీఎంగారు చేసిన రివ్యూలో ఒకమాట చెప్పారు, మన పిల్లల కోసం ఏమైనా చేయాలన్నారు, మీ గుండె నిబ్బరమే రాబోయే రోజుల్లో మిమ్మల్ని కాపాడుకోవడానికి సిద్దంగా ఉన్నారు, ఆరునూరైనా రాబోయే రోజుల్లో శ్రీ జగన్ గారు ముప్పై సంవత్సరాలు సీఎంగా ఉంటారు. అందరికీ ధన్యవాదాలు.
*నవ్యందు ప్రియ, బీఏ సెకండ్ ఇయర్, బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్*
నెల్సన్ మండేలా చెప్పినట్లు ఈ ప్రపంచాన్ని మార్చడానికి విద్య అనేది అత్యంత శక్తిమంతమైన ఆయుధం అన్న మాటను మీరు కూడా ఆ మాటనే ఆచరిస్తున్నారేమో, విద్యారంగంలో మునుపెన్నడూ లేని విధంగా మార్పులు తీసుకొచ్చారు. మీకు ధన్యవాదాలు. మీరు ఒకానొక సందర్బంలో చెప్పినట్లు ఒక దీపం ఒక గదికి వెలుగునిస్తుంది, కానీ ఒక చదువుల దీపం కుటుంబ రూపురేఖలే మారుస్తుందన్నారు కానీ ఇక్కడ రాష్ట్ర రూపురేఖలే మారుతున్న పరిస్ధితిని మనం గమనిస్తున్నాం, మేం చాలా కృతజ్ఞులం సార్, కేవలం విద్యకు సంబంధించే వివిధ పథకాల ద్వారా ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకూ ప్రతీ ఒక్క విద్యార్ధి లబ్ధి పొందుతున్నారు. ఈ రోజు నేను ఇక్కడ నుంచి మాట్లాడుతున్నా, కాలేజీకి వస్తున్నానన్నా అది మీ చలవే, నాకు అమ్మ మాత్రమే ఉంది, మీ చల్లని దీవెనలతో నేను జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన ద్వారా లబ్ధి పొందానని నేను గొప్పగా చెప్పుకుంటాను. ఏ ఆడపిల్లకు అయినా మీరే ధైర్యం, దిశ యాప్ ఓపెన్ చేయగానే మీ ఫేస్ చూడగానే వచ్చే ధైర్యం నేను మాటల్లో చెప్పలేను. నిజంగా మీరు మాత్రమే మా గురించి ఇంత గొప్పగా ఆలోచించగలరు. వలంటీర్ వ్యవస్ధ చాలా గొప్ప వ్యవస్ధ, కరోనా టైంలో ఏ బంధువు అయినా ఫోన్ చేసి మాట్లాడారు కానీ మీరు పంపిన బంధువు మాత్రం మా ఇంటి గడప వద్దకు వచ్చి మాట్లాడారు. మీ ఆరోగ్యం ఎలా ఉందని పలకరించారు, దేశమే కాదు ప్రపంచమంతా కూడా వలంటీర్ వ్యవస్ధ గురించి మాట్లాడుతుంది. డిగ్రీ కూడా ఒక ప్రొఫెషనల్ కోర్సుకు సమానం అవ్వాలన్న గొప్ప ఆలోచనకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. డిగ్రీలో కూడా కొత్త ఇంటర్న్‌షిప్‌లు ప్రవేశపెట్టి మాకు చాలా నేర్పుతున్నారు. మా మామయ్యగా, అన్నగా మా వెన్నంటి నడుస్తున్నారు. బాపట్లను జిల్లాగా ప్రకటించినందుకు, మెడికల్ కాలేజ్ మంజూరు చేసినందుకు ఇక్కడి ప్రజల తరపున మీకు ధన్యవాదాలు. మళ్ళీ మీరే సీఎంగా రావాలి.
*శృష్ణ ప్రియ, ఇంజినీరింగ్ విద్యార్ధిని, బాపట్ల ఇంజినీరింగ్ కాలేజ్*
సార్, నేను పదేళ్ళ వయసులో ఉన్నప్పుడే నా తండ్రిని కోల్పోయాను, నన్ను మా అక్కను చదివించడానికి మా అమ్మ చాలా కష్టాలు పడింది. మా అక్క ఫీజు రీఇంబర్స్‌మెంట్ ద్వారా చదివి తన ఇంజినీరింగ్ పూర్తిచేసింది, తను చదివే సమయంలో రూ. 35 వేలు ఫీజు రీఇంబర్స్‌మెంట్ మాత్రమే వచ్చేది, మిగిలిన ఫీజులు కట్టడానికి మా అమ్మ రాత్రిపగలు చాలా కష్టపడేది, లోన్లు కూడా తీసుకుంది. జగనన్న విద్యాదీవెన ద్వారా మొత్తం ఫీజు రీఇంబర్స్‌మెంట్ జరుగుతుంది. నాకు జగనన్న ఒక అన్నలా సాయం చేస్తున్నారు. నేను ఒక్క రూపాయి కూడా నా చేతి నుంచి కట్టకుండా చదువుకుంటున్నాను. ఇంజినీరింగ్‌తో పాటు అనేక సర్టిఫికేషన్ కోర్సులు కూడా నేర్పుతున్నారు. నేను నా ఇంజినీరింగ్ పూర్తయ్యే సరికి కచ్చితంగా ఉద్యోగం సాధించగలననే నమ్మకం ఉంది. జగనన్న విదేశీ విద్యా దీవెన ద్వారా కూడా విదేశాలలో ఉన్నత చదువులు చదివే అవకాశం కల్పిస్తున్నారు. దిశ యాప్ చాలా బావుంది. విద్యార్ధుల అందరి తరపునా మీకు కృతజ్ఞతలు.
*విద్యాదీవెన పథకం ద్వారా లబ్ధిపొందిన విద్యార్ధి తల్లి*
జగనన్నా నేను కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాను, నాకు ముగ్గురు పిల్లలు. మేం ఇంట్లో 13 మంది కుటుంబ సభ్యులం, మా ఇంట్లో ఫించన్ నుంచి విద్యాదీవెన వరకు అన్నీ వస్తున్నాయి. నేను ఇక్కడికి వస్తున్నాను అంటే మా అమ్మమ్మ ఒక మాట చెప్పింది, ఆమెకు నలుగురు కొడుకులు, జగనన్న నిన్ను తమ ఐదో బిడ్డగా చెప్పమని నాకు చెప్పింది, మా అత్తకు చేయూత, ఆసరా సాయం అందింది, నా తోడుకోడలుకు భర్త చనిపోతే వైఎస్సార్ బీమా సాయం అందింది, నా పిల్లలకు విద్యాదీవెన, వసతి దీవెన, అమ్మ ఒడి అన్నీ అందుతున్నాయి. ఈ మూడేళ్ళలో మా ఇంట్లో అందిన సాయం రూ. 5.19 లక్షలు, నేను చాలా గర్వంగా చెబుతున్నాను. ఇంత చేసిన జగనన్నకు మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం, మన ఊపిరి ఉన్నంతవరకు జగనన్నే ఉండాలి, జగనన్నే రావాలి. నాకు సోదరుడు లేడన్న బాధ ఉండేది, కానీ ఇప్పుడు మీకు రాఖీ కడుతున్నందుకు సంతోషంగా ఉంది. ధ్యాంక్యూ.
addComments
Post a Comment