ఓటరు జాబితా సవరణలకు ఇ సి ఐ నూతన మార్గనిర్దేశకాలు: నితీష్ కుమార్ వ్యాస్



ఓటరు జాబితా సవరణలకు ఇ సి ఐ  నూతన మార్గనిర్దేశకాలు: నితీష్ కుమార్ వ్యాస్ 



ఆగస్టు 1 నుండి నూతన మార్గనిర్దేశకాలు రాష్ట్రంలో అమలు చేస్తున్నాం: ముఖేష్ కుమార్ మీనా 


తిరుపతి , ఆగష్టు 06 (ప్రజా అమరావతి):  కేంద్ర ఎన్నికల కమీషన్ ఓటరు నమోదు, సవరణ పత్రాలకు సంబంధించి పలు కీలక మార్పులు చేసిందదని, అమలుకు అత్యధిక ప్రాదాన్యత ఇవ్వాలని డిప్యూటి ఎలక్షన్ కమిషనర్ , ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, న్యూడిల్లీ నితీష్ కుమార్ వ్యాస్ సూచించారు. శనివారం స్థానిక సరోవర్ హోటల్ నందు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాతో కలసి జిల్లా ఎన్నికల అధికారులు  చిత్తూరు ఎం.హరినారయణన్ , తిరుపతి కె.వెంకటరమణా రెడ్డి , ఇఆర్ ఓ లతో సమావేశమై పలు సూచనులు చేసారు. 


ఇ సిఐ డిప్యూటి ఎలక్షన్ కమిషనర్ , మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల కమీషన్ ఓటరు నమోదు, సవరణ పత్రాలకు సంబంధించి పలు కీలక మార్పులు చేసిందని ,  ఫారం 6 ఇకపై కొత్త ఓటర్ల నమోదు కోసం మాత్రమే నిర్దేశించబడిందని, జాబితాలో పేరు తొలగింపుకు ఉపయోగించే ఫారం 7 విషయంలో ఇకపై మరణ ధృవీకరణ పత్రాన్ని జతచేయవలసి ఉంటుందని తెలిపారు. నియోజకవర్గ పరిధిలోనే కాక, ఇతర నియోజక వర్గాలకు ఓటరు మార్పు, నూతన ఓటరు గుర్తింపు కార్డు జారీ,  వైకల్యం ఉన్న వ్యక్తిని గుర్తించడం వంటి అంశాలకు కూడా ఫారం 8 వినియోగించాలని సూచించారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ – 2023 షెడ్యూల్ మేరకు ప్రి రివిజన్, రివిజన్ ప్రక్రియలు జరపి తుది జాభితా 2023 జనవరి 5 న ప్రచురించాలని తెలిపారు. 



రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా పవర్ పాయింట్ ద్వారా వివరిస్తూ జిల్లాల విభజన మేరకు 26 జిల్లాల్లో వున్న అసెంబ్లీ సెగ్మెంట్  లలో  ఈ నెల 4 నుండి ఇ సి ఐ ఆదేశాలతో ప్రిరివిజన్ ప్రక్రియ మొదలైందని నవంబర్ 7  నాటికి పూర్తిచేసి,  రివిజన్ యాక్టివిటీ 2023  జనవరి  3 నాటికి పూర్తిచేసి 5 న ఫైనల్  ఓటర్ల జాబితా ప్రకటన చేయనున్నామని వివరించారు. 


చిత్తూరు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఎం. హరినారాయణన్  ఉమ్మడి జిల్లా నియోజకవర్గాల వివరాలను , 


తిరుపతి జిల్లా ఎన్నికల అధికారి మరియు  కలెక్టర్  కె వెంకటరమణా రెడ్డి తిరుపతి జిల్లా లోని నియోజకవర్గాల వివరాలను విడివిడిగా 


పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా జిల్లాలో చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ వంటి వాటిపై వివరించారు.


ఈ సమీక్షలో ఇ సి ఐ ఎల్ సి ఇ ఓ సంజయ్ సౌబే , ఇ సి ఐ ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ , తిరుపతి , ఉమ్మడి చిత్తూరు జిల్లాల ఇ ఆర్ ఓలు పీలేరు -చినరాముడు , మదనపల్లి - మురళి , పుంగనూరు -డి సుబ్రహ్మణ్యం , తిరుపతి -చంద్ర మౌళీశ్వర రెడ్డి , శ్రీకాళహస్తి -శ్రీనివాసులు , నగరి - లక్ష్మి , చిత్తూరు - రేణుక , పలమనేరు - భావాని , కుప్పం -ప్రభాకర్ రెడ్డి , గూడూరు - వి.మురళీకృష్ణ , సూళ్లూరు పేట - కె ఎం రోస్ మాండ్ , వేంకటగిరి - సాంబ శివారెడ్డి , చంద్రగిరి - కనక నరసారెడ్డి పూతలపట్టు - పర్వీన్  పాల్గొన్నారు. 



Comments