నవంబర్‌లోగా వైఎస్సార్ హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణం పూర్తి కావాల్సిందే...
*రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు*
అమరావతి (ప్రజా అమరావతి): నవంబర్ నెలాఖరులోగా వైఎస్సార్ హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణాల్ని పూర్తి చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు స్పష్టంచేశారు. నిధుల విషయంలో ఆందోళన వద్దని బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లిస్తామని తెలిపారు. ప్రతి నెలా 20లోగా బిల్లు పంపించాలని స్పష్టంచేశారు. మంగళగిరి ఏపీఐఐసీ భవనంలో శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఒప్పందం ప్రకరారం సెప్టెంబర్‌లోగా వైఎస్సార్ హెల్త్ క్లినిక్ భవనాలు పూర్తవ్వాల్సి ఉందన్నారు. వర్షాలు, ఇతరకారణాల వల్ల నిర్మాణాల్లో జాప్యం చోటుచేసుకుందన్నారు. నవంబర్ నెలాఖరు నాటికి భవన నిర్మాణాల పూర్తికి సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి గడువిచ్చారన్నారు. సీఎం ఆదేశాల మేరకు ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్సార్ హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణం పూర్తి కావాల్సిందేనన్నారు. నిధుల విషయంలో ఢోకా లేదని, ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు స్పష్టంచేశారు. ప్రతి నెలా 20లోగా బిల్లులు పంపిస్తే, అంతే త్వరగా నిధులు మంజూరు చేస్తామన్నారు. భవన నిర్మాణాలపప క్షేత్ర స్థాయి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తీసుకోవాలని డీఎంహెచ్‌వోలను ఆదేశించారు. జిల్లా కలెకక్టర్లు తమ జిల్లా పరిధిలో చేపట్టిన వైఎస్సార్ హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణాల పనులను పర్యవేక్షిస్తుండాలన్నారు. ప్రతి నెలా వైఎస్సార్ హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణాల ప్రగతిపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో కొత్తగా 175 పీహెచ్‌సీల నిర్మాణం చేపట్టామన్నారు. వాటి నిర్మాణాలు కూడా గడువులోగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆయన ఆదేశించారు. కాంట్రాక్లర్లు ఆసక్తిచూపకపోతే, మరోసారి టెండర్లు పిలిచి కొత్త కాంట్రాక్టర్లకు పీహెచ్‌సీ భవనాల నిర్మాణ పనులు అప్పగించాలన్నారు.
*ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత*
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లోనూ మౌలిక వసతుల కల్పనకు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తెలిపారు. కొత్త జిల్లాల డిఎంహెచ్‌వో కార్యాలయాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. కార్యాలయాల ఏర్పాటుకు తక్షణం ప్రతిపాదనలు పంపస్తే, రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని ఆయన తెలిపారు. ఏ జిల్లాలోనూ మౌలిక సదుపాయాల లేమితో డిఎంహెచ్‌వోలు ఇబ్బంది పడకూడదన్నారు. ప్రస్తుతం వరదల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలేఅవకాశముందన్నారు. జిల్లా కలెక్టర్లతో పాటు వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఫీవర్ సర్వే పకగ్బందీగా చేట్టాలన్నారు. దీనివల్ల జ్వరాలు, డెంగ్యూ, చికున్ గున్యా వంటి వ్యాధుల హాట్‌స్పాట్‌లు సులభంగా గుర్తించొచ్చునన్నారు. ప్రజాప్రతినిధులు, స్వచ్ఛం సంస్థల సాయంతో కొవిడ్ వ్యాక్సినేషన్ మరింత వేగవంతం చేయాలని ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్ , ఎపివివిపి కమీషనర్ డాక్టర్ వినోద్ కుమార్, డిహెచ్ డాక్టర్ యు.స్వరాజ్యలక్ష్మి , ఆయా జిల్లా కలెక్టర్లు, డీఎంహెచ్‌వోలు, ఇతర వైద్యాధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment