కర్బన ఉద్గారాల రహిత ఆర్థిక వ్యవస్థ దిశగా ఆంధ్రప్రదేశ్*ఆంధ్రప్రదేశ్ లో ఎలక్ట్రానిక్ వాహన రంగ వ్యవస్థ ఏర్పాటు కోసం రేపు డబ్ల్యూఎఫ్ తో భాగస్వామ్య సదస్సు : పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్*


*కర్బన ఉద్గారాల రహిత ఆర్థిక వ్యవస్థ దిశగా ఆంధ్రప్రదేశ్* 


*వరల్డ్ ఎకనమిక్ ఫోరంతో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలి వర్చువల్ కాన్ఫరెన్స్*


*పర్యావరణ పరిరక్షణతోనే ఉజ్వల పారిశ్రామికాభివృద్ధి*

 

*పాల్గొననున్న ఎలక్ట్రిక్ వాహన సంస్థలకు చెందిన 60 మందికి పైగా సీఈవోలు*


అమరావతి, ఆగస్ట్, 04 (ప్రజా అమరావతి): ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడుల ఆకర్షణలో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుడుతోందని పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్ నాథ్ వెల్లడించారు. ఎలక్ట్రానిక్ వాహన రంగంలో రూ.32వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ఏపీ ముందుకు వెళుతున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. అయితే పర్యావరణానికి హానీ చేయని పరిశ్రమలకు ఏపీ ప్రాధాన్యతనిస్తుందని ఆయన స్పష్టం చేశారు.  ఎలక్ట్రిక్ వాహన తయారీ హబ్ గా తీర్చిదిద్దడంలో భాగంగా వరల్డ్ ఎకనమిక్ ఫోరంతో ఆంధ్రప్రదేశ్ తొలి వర్చువల్ సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి అమర్ నాథ్ పేర్కొన్నారు. "షేపింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ మొబిలిటీ"పేరుతో ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు నిర్వహించే ఈ వర్చువల్ సదస్సులో ప్రధానంగా 'ఎలక్ట్రిక్ వాహనరంగం'లో పెట్టుబడులు, అవకాశాలపై చర్చించనున్నట్లు మంత్రి తెలిపారు. 60 మందికి పైగా ఎలక్ట్రిక్ వాహన సీఈవోలు పాల్గొనే ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ అవకాశాలను మంత్రి గుడివాడ అమర్ నాథ్ వివరించనున్నారు. కర్బన ఉద్గారాల రహిత ఆర్థిక వ్యవస్థ దిశగా ఆంధ్రప్రదేశ్ అడుగులు వేస్తున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనరంగానికి సంబంధించిన వాహనాల తయారీ, విడి భాగాల తయారీ, ఛార్జింగ్ కి సంబంధించిన సదుపాయాలు, ఇతరత్రా అంశాలపై కంపెనీల సీఈవోల ద్వారా అభిప్రాయలు సేకరించనున్నారు. 


ఎలక్ట్రానిక్ వాహన రంగంలో  మౌలిక వసతులు, క్లస్టర్ డెవలప్ మెంట్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటి అంశాలపై ఏపీఈడీబీ సీఈవో, ఏపీఐఐసీ వీసీ, ఎండీ సుబ్రమణ్యం జవ్వాది సీఈవోలతో వర్చువల్ సదస్సులో మాట్లాడనున్నారు.


 ఈ సదస్సులో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్, విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్, రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి  ఎం.టి క్రిష్ణబాబు,  నీతి ఆయోగ్ సలహాదారు (మౌలిక వసతుల అనుసంధానం, రవాణా, ఎలక్ట్రిక్ మొబిలిటి) జె.సిన్హా,  ఏపీఈడీబీ సీఈవో, ఏపీఐఐసీ వీసీ&ఎండీ సుబ్రమణ్యం జవ్వాది, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన గుమ్మాల, వరల్డ్ ఎకనమిక్ ఫోరం, మూవింగ్ ఇండియా ప్రతినిధుల బృందం, ఎలక్ట్రానిక్ మానుపాక్చరింగ్ కంపెనీల సీఈవోలు,తదితరులు పాల్గొననున్నారు.


*"డబ్ల్యూఈఎఫ్ మూవింగ్ ఇండియా" సదస్సుకు సంబంధించిన మరిన్ని వివరాలకు 

ఈ కింది వెబ్ సైట్లు సంప్రదించగలరు:* 


https://apedb.gov.in/


https://www.apindustries.gov.in/APIndus/Default.aspx


*సోషల్ మీడియాలో సమాచారం కోసం ఈ కింద లింక్ ల ద్వారా సంప్రదించగలరు :*


Twitter – https://twitter.com/ap_edb?lang=en


Facebook – https://www.facebook.com/APEDB


LinkedIn –  https://www.linkedin.com/company/official-andhra-pradesh-economic-development-board/mycompany/
Comments