అమరావతి (ప్రజా అమరావతి);
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఎంపీడీవోల సంఘం ప్రతినిధులు.
దాదాపు 25 ఏళ్ళుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న 237 మంది ఎంపీడీవోలకు డిప్యూటీ సీఈవోలుగా, డీడీవోలుగా ఒకేసారి పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు కాకర్ల వెంకటరామిరెడ్డి, ఎంపీడీవోల సంఘం అధ్యక్షుడు వై.బ్రహ్మయ్య, ప్రధాన కార్యదర్శి జీవీ.నారాయణరెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ కె.శ్రీనివాసరెడ్డి, కన్వీనర్ కేఎన్‌వీ.ప్రసాదరావు, జాయింట్ సెక్రటరీ శ్రీనివాసరావు.
addComments
Post a Comment