రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి);
..ప్రభుత్వ ప్రాధాన్యతా భవననాల పురోగతిని వేగవంతం చేయాలి.. ..
కలెక్టరు. డా. మాధవీలత
ప్రభుత్వ ప్రాధాన్యతా భవననాల పురోగతిని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టరు డా. కె. మాధవీలత అధికారులకు అదేశించారు.
బుధవారం స్థానిక జిల్లా కలెక్టరు క్యాంపు కార్యాలయంలో పంచాయితీరాజ్ శాఖ అధికారులతో ప్రభుత్వ భవన నిర్మాణ పురోగతి పై వీసీ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ జిల్లాలో 390 సచివాలయాల భవనాలకు గాను 276 పూర్తి చేయడం జరిగిందిని మిగిలినవి భవనాలు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయన్నారు. అదేవిధంగా 373 ఆర్బీకేలకు గాను 197 ఆర్భీకేల భవన నిర్మాణాలు పూర్తిచేశామని, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లు 338 గాను 131 భవన నిర్మాణాలు పూర్తి చేయగా మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్షిస్తూ ఉండ్రాజవరం మండలంలో భవన నిర్మాణల పనుల పురోగతిలో వెనకబడి ఉండటం పట్ల కలెక్టరు అసహనం వ్యక్తం చేసారు. బిక్కవోలు, రాజమహేంద్రవరం రూరల్ మండలం లక్ష్యాలను సాధించడంలో ఫలితాలు చూపకపోతే శాఖా పరమైన చర్యలు తీసుకునేందుకు వెనుకాడేది లేదని హెచ్చరించారు. జిల్లాలో ఇంకా బేస్ మెంట్ స్థాయికి చేరని 67 భవన నిర్మాణ పనులను ప్రారంభించి వచ్చే వారం నాటికి లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టరు అధికారులను ఆదేశించారు. లక్ష్యాలను సాధించడంలో నిర్లక్ష్యం వహిస్తే అటువంటి అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
addComments
Post a Comment