నెల్లూరు (ప్రజా అమరావతి);
స్పందనలో వచ్చిన అర్జీలను నిర్ధేశించిన గడువు లోగా పరిష్కరించేలా జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల
ని జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు, అధికారులను ఆదేశించారు.
సోమవారం ఉదయం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు, జాయింట్ కలెక్టర్ శ్రీ కూర్మనాథ్, డి.ఆర్.ఓ శ్రీమతి వెంకట నారాయణమ్మ లతో కలసి స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల వద్ద నుండి అర్జీలు స్వీకరించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో వివిధ శాఖలకు సంబంధించి స్పందనలో వచ్చిన అర్జీలను నిర్ధేశించిన గడువు లోపు పరిష్కరించాలని, పెండింగ్లో ఉన్న అర్జీలను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. ఇకపై గడువు దాటిన అర్జీలు ఏమాత్రం పెండింగ్లో ఉండకుండా పూర్తిగా నిర్ణీత గడువులో పరిష్కరించాలని స్పష్టం చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో పరిష్కరించిన అర్జీలు తిరిగి వస్తున్నాయని, వాటిపై సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకుని పరిష్కరించడంతో పాటు మరల రాకుండా చూడాలన్నారు.
వివిధ శాఖల్లో పెండింగ్ లో ఉన్న కోర్టు కేసుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు, అధికారులను అదేశించారు. ఏదైనా కోర్టు ఉత్తర్వులు నిర్ధేశించిన గడువులో అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు.
ఈ సమావేశంలో డి.ఆర్.డి.ఎ., డ్వామా పిడి., మెప్మా పీడీలు శ్రీ సాంబశివారెడ్డి, శ్రీ తిరుపతయ్య శ్రీ రవీంద్ర, జడ్పీ సి.ఈ.ఓ శ్రీమతి వాణి, డి.పి.ఓ శ్రీమతి ధనలక్షి, ఐసీడీఎస్ పీడీ శ్రీమతి ఉమామహేశ్వరి, బి.సి కార్పొరేషన్ ఈ.డి శ్రీ బ్రహ్మానంద రెడ్డి, డిడి సోషల్ వెల్ఫేర్ శ్రీమతి రమాదేవి, జలవనరుల శాఖ ఎస్ఇ శ్రీ కృష్ణమోహన్, డిఎస్ఓ శ్రీ వెంకటేశ్వర్లు, డిటిసి శ్రీ బి చందర్, సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు ఆఫీసర్ శ్రీ ఉషారాణి, డి.సి.ఓ శ్రీ తిరుపాల్ రెడ్డి, సర్వే భూరికార్డుల ఏడి శ్రీ హనుమాన్ ప్రసాద్, సెట్నల్ సిఈఓ శ్రీ పుల్లయ్య, డిఎస్డబ్ల్యూఓ శ్రీ వెంకటయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment