*పౌరులకు రాజ్యాంగ పరంగా చెందాల్సిన మానవ హక్కులను కాపాడాల్సిన బాధ్యత మన అందరిది: చైర్ పర్సన్ NHRC*
*మానవ హక్కులకు భంగం వాటిల్లినప్పుడు NHRC తప్పక స్పందించి బాధితులకు అండగా నిలుస్తుంది: ఛైర్ పర్సన్, NHRC*
తిరుపతి, ఆగస్ట్'07 (ప్రజా అమరావతి):
పౌరులకు రాజ్యాంగ పరంగా చెందాల్సిన హక్కులను కాపాడాల్సిన బాధ్యత మన అందరిపై ఉంద
ని
జాతీయ మానవహక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ అరుణ్ మిశ్రా అన్నారు. ఆదివారం ఉదయం స్థానిక శ్రీ పద్మావతి అతిథి గృహం సమావేశ మందిరం లో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో వీరితో పాటు NHRC మెంబర్లు మహేష్ మిట్టల్ కుమార్, ధ్యానేశ్వర్ మనోహర్ మూలే, రాజీవ్ జైన్, దేవేంద్ర కుమార్ సింగ్, జాయింట్ సెక్రటరీ హరీష్ చంద్ర చౌదరీ, ఎస్ పి ఎఫ్ డి.జి సంతోష్ మెహ్రా, జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి, జిల్లా ఎస్ పి పరమేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా NHRC ఛైర్మన్ మాట్లాడుతూ కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం పౌరులకు ఎక్కడైనా మానవ హక్కులకు భంగం కలిగితే వాటికి సంబంధించిన ఫిర్యాదుల కు స్పందించి పరిష్కార దిశగా చర్యలు చేపట్టడం అన్నారు. రాజ్యాంగం ప్రకారం పౌరులకు గౌరవంగా జీవించే, స్వేచ్చా యుత వాతావరణములో జీవించే హక్కు తదితర మానవ హక్కుల కు భంగం వాటిల్లినప్పుడు NHRC వెబ్సైట్ నందు ఫిర్యాదు నమోదు చేయడం ద్వారా లేదా మెయిల్ ద్వారా లేదా ప్రత్యక్షంగా అయినా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. జిల్లాకు సంబంధించిన మానవ హక్కుల కేసులను వరుసగా జిల్లా కలెక్టర్, ఎస్ పి లతో సమీక్షించి గతంలోనే రిపోర్ట్ లు పంపిన వాటి వివరాలు అడిగి తెలుసుకుని పలు సూచనలు మార్గదర్శకాలు చేశారు.
పెండింగ్ లో ఉన్న వాటిపై త్వరిత గతిన విచారణ తదితరాలు పూర్తి చేసి తీసుకున్న చర్యలపై నివేదికలు సమర్పించాలని కోరారు. ప్రజలు సంతోషంగా ఉంటే ఎలాంటి ఫిర్యాదులు ఉండవనీ వారు సమస్యలతో వస్తే వాటిని కింది స్థాయిలోనే సత్వరమే పరిష్కరిస్తే బాగుంటుందని సూచించారు. లంచం లాంటి చీడ నుండి ప్రజలకు అందాల్సిన సేవలు సకాలంలో అందక ఇబ్బందులు ఎదుర్కొంటే వారు తప్పని పరిస్థితిలో NHRC లాంటి వాటికి ఫిర్యాదు చేసే అవకాశం ఉందనీ, పేదవారు అక్షరాస్యత లేని వారు NHRC లాంటి వాటికి ఫిర్యాదు ఎలా చేయాలో తెలియని పరిస్థితులు ఉంటాయనీ, అలా కాకుండ అర్హులైన పేదవారికి సంక్షేమ అభివృద్ధి ఫలాలు పౌర హక్కులు స్వేచ్చగా అనుభవించే వాతావరణం కల్పించాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందని గుర్తు చేశారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ మరియు జిల్లా యంత్రాంగం కలిసి ప్రజలకు మేలు జరిగేలా పని చేద్దాం అని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చాలా వరకు ఫిర్యాదులు పరిష్కరించామని, పెండింగ్ లో ఉన్న కొన్ని అర్జీలను త్వరలోనే విచారణ చేసి నివేదిక సమర్పిస్తామని తెలిపారు. చైర్ పర్సన్ వారి స్ఫూర్తి దాయక సూచనలు మార్గదర్శకాలను తప్పక అమలు చేసి అర్హులైన పేద వారికి నిష్పక్షపాతంగ పౌర సేవలు సకాలంలో సమర్థవంతంగా అందజేస్తామని అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస రావు, తిరుపతి ఆర్ డి ఓ కనక నరస రెడ్డి, రూయ ఆసుపత్రి సూపరింటెండెంట్ భారతి, డి ఆర్ డి ఎ పథక సంచాలకులు ప్రభావతి, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని విజయ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment