ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన టెక్‌ మహీంద్ర ఎండీ, సీఈవో సీపీ. గుర్నాని


అమరావతి (ప్రజా అమరావతి);

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన టెక్‌ మహీంద్ర ఎండీ, సీఈవో సీపీ. గుర్నానిఇటీవల దావోస్‌లో జరిగిన వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సదస్సులో సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసి ఏపీలో టెక్‌ మహీంద్ర కార్యకలాపాలు, విస్తరణ గురించి చర్చించిన సీపీ. గుర్నాని 


విశాఖలో టెక్‌ మహీంద్ర కార్యకలాపాల విస్తరణపై ఇరువురి మధ్య చర్చ. 

ఏపీలో ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఐటీ, హై ఎండ్‌ టెక్నాలజీలపై నైపుణ్యాభివృద్ధిపైనా సీఎంతో చర్చించిన గుర్నాని.

ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యంతో వీటిని అమలు చేసి ఉద్యోగావకాశాలను కల్పించే అవకాశంపైనా సమావేశంలో చర్చ.

టెక్‌ మహీంద్రాతో కలిసి కార్యాచరణచేయాలని సమావేశంలో పాల్గొన్న అధికారులకు సీఎం ఆదేశం. 


ఈ సమావేశంలో పాల్గొన్న టెక్‌ మహీంద్ర గ్లోబల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (అడ్మినిస్ట్రేషన్‌) సీవీఎన్‌. వర్మ, సీనియర్‌ బిజినెస్‌ హెడ్‌ రవిచంద్ర కొల్లూరు, రిక్రూట్‌మెంట్‌ లీడర్‌ శ్రీనివాస్‌ రెడ్డి వీరంరెడ్డి, అడ్మిన్‌ మేనేజర్‌ (విజయవాడ) జయపాల్, సీఎంవో అధికారులు.

Comments