బాలలపై వేధింపులు అరికట్టేందుకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలినెల్లూరు, ఆగస్టు 12 (ప్రజా అమరావతి):-- బాలలపై వేధింపులు అరికట్టేందుకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాల


ని జిల్లా కలెక్టర్ శ్రీ కెవిఎన్ చక్రధర్ బాబు గురుకుల పాఠశాలల ప్రిన్సిపాల్ లను ఆదేశించారు.  


శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయంలో బాలలపై వేధింపులు అరికట్టాలి అనే నినాదంతో ప్రచురించిన గోడపత్రాలను ఆవిష్కరించారు. 


 ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బాల్యం ఎంతో అమూల్యమైనదని, బాలల రక్షణ మనందరి బాధ్యతని గుర్తించాలని, ఆపదలో ఉన్న బాలల రక్షణ కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.  బాలలపై వేధింపులను కూడా  అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.  ఇటువంటి సమాచారం తెలపడానికి మహిళా హెల్ప్లైన్ 181 గానీ,  చైల్డ్ లైన్ 1098 గాని పోలీసులకు 100కు గానీ  ఫోన్ చేసి అందించాలన్నారు.  బాలలపై వేధింపుల అరికట్టే విషయమై జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు  నిర్వహించాలని సూచించారు.


ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాలల జిల్లా సమన్వయకర్త శ్రీమతి హేమలత, జిల్లాలోని గురుకుల పాఠశాలల ప్రిన్సిపాల్ లు శ్రీమతి భారతి, శ్రీమతి ఎస్తేరమ్మ, శ్రీమతి మహాలక్ష్మి, శ్రీమతి శైలజ, శ్రీమతి సుజాత, శ్రీమతి అనురాధ, శ్రీమతి స్నేహలత తదితరులు పాల్గొన్నారు. Comments