విజయవాడ (ప్రజా అమరావతి);
ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి..
- ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ కె. విజయా నంద్
రాష్ట్రంలో 24X7 నిరంతర విద్యుత్ సరఫరా అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారని, దానిని అమలు చేసేందుకు ఇంధన శాఖ పూర్తి ప్రణాళికలతో సంసిద్దంగా ఉందని ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ కె. విజయా నంద్ తెలిపారు. విజయవాడలో ఫార్చూన్ మురళి హోటల్ లో బుధవారం నిర్వహించిన ఫెర్ఫామెన్స్, అచీవర్స్ అండ్ ట్రేడ్ (PAT) వర్క్ షాపులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా విజయానంద్ మాట్లాడుతూ... పెర్ఫార్మెన్స్, అచీవ్ అండ్ ట్రేడ్ (PAT) స్కీమ్ రాష్ట్రంలో 2008 నుంచి ప్రారంభించామని, ఈ స్కీమ్ రాష్ట్రంలో 36 హై ఎనర్జీ ఇంటెన్సివ్ పరిశ్రమల్లో అమలు చేశాయని తెలిపారు. ఈ పథకం అమలు చేస్తున్న రాష్ట్రాల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రగ్రామిగా ఉందని ఆయన తెలిపారు. బొగ్గు, చమురు, గ్యాస్, లిగ్నైట్ మొదలైన ఇంధనాలను ఎక్కువగా ఉపయోగించే పరిశ్రమల ఇంధన సామర్థ్యం పెంచేవిధంగా కార్బన్ డైయాక్స్డ్ తగ్గించే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు. PAT స్కీమ్ ద్వారా దాదాపు రూ.5,700 కోట్లకు పైగా ఇంధనాన్ని రాష్ట్రంలో పొదుపు చేయగలిగామన్నారు. ఈ సందర్భంగా PAT స్కీమ్ లో భాగస్వామ్యులైన పారిశ్రామికవేత్తలను అభినందించారు. రాష్ట్రంలో నిరంతరంగా నాణ్యమైన విద్యుత్ అందించడానికి రాష్ట్రప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందన్నారు. దీనిలో భాగంగా 1600 మెగావాట్ల విద్యుత్ ను అదనంగా కొనుగోలుచేశామన్నారు. ప్రపంచవ్యాప్తంగా భూతాపం పెరగడంతో ఉష్ణోగ్రతలు తగ్గించడానికి అనేక కార్యక్రమాలు అమలుకు 198 దేశాలు ముందుకొచ్చాయని తెలిపారు. పర్యావరణ పరిరక్షణతో పాటు, ఇంధన సామర్థ్య పెంపుదలపై అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాయన్నారు. మన దేశం నుండి PAT స్కీం ఇందులో ఒక ముఖ్యమైన కార్యక్రమం అని, దానిని ఆంధ్రప్రదేశ్ లో మరింత సమర్థవంతంగా అమలు చేసి దేశంలో అగ్రగామిగా నిలిచామని విజయానంద్ అన్నారు.
ఈ కార్రక్రమంలో కేంద్ర బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ప్రాజెక్ట్ ఇంజనీర్ విశాల్ మెహతా వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. ఫిక్కీ జాయింట్ డైరెక్టర్ పుష్పేంద్ర నాయక్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్టీ కన్జర్వేషన్ మిషన్ సీఈవో ఎ. చంద్రశేఖర్ రెడ్డి, ప్రతినిధి మాధవి, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ అధికారులు, పరిశ్రమల శాఖ ప్రతినిధులు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పరిశ్రమల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment