శిష్ట్లా లోహిత్ ను వెంటబెట్టుకుని కుప్పం పర్యటనకు బయలుదేరి వెళ్లిన చంద్రబాబు




*శిష్ట్లా లోహిత్ ను వెంటబెట్టుకుని కుప్పం పర్యటనకు బయలుదేరి వెళ్లిన చంద్రబాబు


 *హైదరాబాద్ నుండి బెంగళూరుకు పయనం* 

 *రోడ్డు మార్గాన కుప్పం చేరుకున్న చంద్రబాబు, శిష్ట్లా లోహిత్* 

 *శ్రీకాళహస్తి నుండి భారీ కాన్వాయ్ ను సిద్ధం చేసిన శిష్ట్లా లోహిత్* 



హైదరాబాద్, ఆగష్టు 24 (ప్రజా అమరావతి): చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటించేందుకు  తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ఆ పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి, కార్యకర్తల సంక్షేమ నిధి కోఆర్డినేటర్ శిష్ట్లా లోహిత్ ను బుధవారం వెంటబెట్టుకుని  వెళ్లారు. హైదరాబాద్ నుండి బెంగళూరుకు విమానంలో బయలుదేరిన చంద్రబాబుతో కలిసి శిష్ట్లా లోహిత్ ప్రయాణించారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన వీరు కుప్పం నియోజకవర్గానికి చేరుకున్నారు. ఈనెల 24, 25, 26 తేదీల్లో చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా శిష్ట్లా లోహిత్ కూడా కార్యకర్తల సంక్షేమానికి సంబంధించి పలు కార్యక్రమాలను రూపొందించనున్నారు. చంద్రబాబు సమక్షంలోనే కార్యకర్తల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించనున్నారు. అలాగే ఆయా సంక్షేమ కార్యక్రమాలపై కార్యకర్తల్లో అవగాహన పెంచడంతోపాటు వాటిని వినియోగించుకునేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోనున్నారు. కుప్పం పర్యటనకు చంద్రబాబు స్వయంగా శిష్ట్లా లోహిత్ ను వెంటబెట్టుకుని మరీ తీసుకు వెళ్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలుగుదేశం పార్టీలో మొదటి నుండి కార్యకర్తల సంక్షేమానికి చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా పెద్దపీట వేస్తూ వస్తున్నారు. దీనిలో భాగంగానే శిష్ట్లా లోహిత్ సమర్ధతను దృష్టిలో పెట్టుకొని, ఆయన సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు రాష్ట్రస్థాయిలో పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి పదవితో పాటు కార్యకర్తల సంక్షేమ నిధి కోఆర్డినేటర్ గా నియమించడం జరిగింది. చంద్రబాబు ఏ జిల్లాలో పర్యటించినా శిష్ట్లా లోహిత్ వెన్నంటే ఉంటూ కార్యకర్తలు అందరికీ సంక్షేమాన్ని అందించే పనిలో నిమగ్నమై ఉన్నారు. దీంతో పాటు చంద్రబాబు పర్యటనను విజయవంతం చేసేందుకు తనవంతుగా ఫ్లెక్సీల ఏర్పాటు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచారం వంటి పబ్లిసిటీ కార్యక్రమాలతో అదరగొడుతున్నారు. చంద్రబాబు కూడా శిష్ట్లా లోహిత్ ను వేదిక పైకి పిలిచి కార్యకర్తల సంక్షేమంపై మాట్లాడిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ ప్రోత్సాహంతో శిష్ట్లా లోహిత్

రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పలు కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇదిలా ఉండగా కుప్పం పర్యటనలో పాల్గొనేందుకు చంద్రబాబుతో కలిసి వస్తున్న శిష్ట్లా లోహిత్, శ్రీకాళహస్తి నుండి భారీ కాన్వాయ్ ను సిద్ధం చేశారు. మూడు రోజుల పాటు చంద్రబాబు వెన్నంటే ఉంటూ కుప్పం నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలను శిష్ట్లా లోహిత్ విజయవంతం చేయనున్నారు.

ఈ సందర్భంగా శిష్ట్లా లోహిత్ మాట్లాడుతూ కుప్పం పర్యటనకు బయలుదేరిన నా ఆరాధ్య దైవం, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రయాణించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రాన్ని రావణకాష్టం చేసిన జగన్ మోహన్ రెడ్డి పాలనను గద్దె దింపడానికి చంద్రబాబు చేస్తున్న పోరాటంలో తాను కూడా కలిసి పోరాడడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని శిష్ట్లా లోహిత్ చెప్పారు.

Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
Shiv Nadar University Chennai inaugurated its flagship Quiz Competition - QUBIZ
Image
बर्खास्त होंगे उत्तराखंड विधानसभा सचिवालय के 228 कर्मी, हाईकोर्ट ने फैसला सही कहा।
Image