.
నెల్లూరు, ఆగస్టు 21 (ప్రజా అమరావతి): ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి మదిలో మెదిలిన సరికొత్త వినూత్న కార్యక్రమమే గడపగడపకు మన ప్రభుత్వమని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను సంతృప్తికర స్థాయిలో అందించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమ
ని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
ఆదివారం ఉదయం పొదలకూరు మండలం విరువూరు గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి, ప్రతి గడపకు వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. ప్రభుత్వం నుంచి వారికి అందిన సంక్షేమ పథకాలను వివరించి, ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించేందుకు, గ్రామంలో ఉన్న సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు వార్డు కౌన్సిలర్ స్థాయి నుంచి మంత్రి వరకు ప్రతి గడపకు వెళ్తున్నామని చెప్పారు. ఏ గడపకు వెళ్లినా ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరాయన్నారు. ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.
తొలుత గ్రామానికి చేరుకున్న మంత్రికి స్థానిక ప్రజా ప్రతినిధులు ఘన స్వాగతం పలకగా, పొదలకూరు- విరువూరు రోడ్డు నిర్మాణం, అంతర్గత సిమెంట్ రోడ్లు, సైడు కాలువలు, నాడు నేడు పథకం కింద హాస్టల్ భవన నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
అనంతరం రూ. 17.50 లక్షలతో నిర్మించిన వైయస్సార్ హెల్త్ క్లినిక్ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మంత్రికి స్వాగతం పలికిన తీరు అందరిని ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీమతి నగేష్ కుమారి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ సుధాకర్ రాజు, స్థానిక ప్రజాప్రతినిధులు సుబ్బరాయుడు, డేగా జగన్మోహన్ రావు, బచ్చల సురేష్ కుమార్ రెడ్డి, మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
addComments
Post a Comment