బుచ్చిరెడ్డిపాలెం మండలంలో మంజూరైన గృహాల నిర్మాణం వేగవంతం చేయాలినెల్లూరు ఆగస్టు 22 (ప్రజా అమరావతి):బుచ్చిరెడ్డిపాలెం మండలంలో మంజూరైన గృహాల నిర్మాణం వేగవంతం చేయాల


ని జిల్లా కలెక్టర్ శ్రీ కెవిఎన్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు.


సోమవారం సాయంత్రం బుచ్చిరెడ్డిపాలెం మండలం కట్టుబడి పాలెం గ్రామంలో జగనన్న లేఅవుట్ ను జిల్లా కలెక్టర్ శ్రీ కెవిఎన్ చక్రధర్ బాబు సందర్శించి గృహ నిర్మాణ పనులను పరిశీలించారు.  ఈ సందర్భంగా గృహాలను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డికి ఎంపీడీవో నరసింహారావుకు సూచించారు.


అనంతరం అక్కడి గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించి గృహ నిర్మాణం కోసం రుణాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని, వీలైనంత ఎక్కువ మందికి రుణాలు మంజూరు చేసేలా కృషి చేయాలని సచివాలయ సంక్షేమ సహాయకులు  జయదీప్ కు సూచించారు.  కూలీలందరిని ఈ శ్రమ పోర్టల్లో పేరు నమోదు అయ్యేలా చూడాలని, కోవిడ్ మూడో డోసు నూటికి నూరు శాతం వేయించాలని సూచించారు.   


 ఈ పర్యటనలో కలెక్టర్ వెంట మునిసిపల్ కమిషనర్ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీడీవో శ్రీ నరసింహారావు సచివాలయ  సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Comments