* కె ఎల్ యూనివర్సిటీ లో ప్రారంభమైన స్మార్ట్ ఇండియా హ్యాక థాన్ పోటీలు...
* 18 రాష్ట్రాల నుంచి పాల్గొన్న విద్యార్థులు...
తాడేపల్లి (ప్రజా అమరావతి);
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సృజనాత్మకతను పెంపొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ విద్యా విభాగం, అఖిల భారత సాంకేతిక విద్యా మండలి సంయుక్తంగా నిర్వహిస్తున్న స్మార్ట్ ఇండియా హ్యాక థాన్ ఫైనల్ పోటీలు కె ఎల్ యూనివర్సిటీ లో గురువారం ప్రారంభమయ్యాయి. 18 రాష్ట్రాల నుంచి 30 బృందాలు ఈ పోటీలో పాల్గొంటాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీలను రాష్ట్ర నైపుణ్యాల అభివృద్ధి సంస్థ చైర్మన్ అజయ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానములో ఎదుర్కొంటున్న సమస్యలను విద్యార్థులు తమ
సృజనత్మకతను జోడించి పరిష్కరించేందుకు ఈ పోటీలు దోహదపడతాయని అన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యం, సృజనత్మకత చాలా ముఖ్యమని ఇందుకోసం విద్యార్థులను ప్రోత్సాహించేలా రాష్ట్ర ప్రభుత్వం అనేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తోందని చెప్పారు. సాంకేతికత క్షేత్ర స్థాయిలో విస్తరించాల్సిన అవసరం ఉందని, ప్రధానంగా వ్యవసాయం, పర్యాటకం, వైద్య రంగాల్లో మరింత విస్తృతమవ్వాలని పిలుపినిచ్చారు. దేశ స్థితిగతులు, ప్రజల ఆర్ధిక పరిస్థితులకు అనుగుణంగా సాంకేతికత విస్తరించాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశంలో మానవ వనరులు సమృద్ధిగా ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుంటే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు. రాష్ట్ర ఇన్నోవేటివ్ సొసైటీ జాయింట్ డైరెక్టర్ లావణ్య. కె ఎల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్ డాక్టర్ సారధి వర్మ పోటీల ప్రారంభోత్సవంలో పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల్లో పెరుగుతున్న సాంకేతిక, సృజనాత్మక విలువలను వారు ఈ సందర్భంగా కొనియాడారు. ప్రతిష్టాత్మకమైన ఈ పోటీలకు కె ఎల్ విద్యాసంస్థను నోడల్ కేంద్రంగా ఎంపిక చేయటం పట్ల సారధి వర్మ హర్షం వ్యక్తం చేశారు. హ్యాక్ థాన్ ప్రోగ్రాం కమిటీ చైర్మన్ డాక్టర్ శ్రీనాథ్, కో ఆర్డినేటర్ డాక్టర్ పవన్ కుమార్, చీఫ్ కో ఆర్డినేటర్స్ డాక్టర్ సుమన్, డాక్టర్ శరత్, డాక్టర్ హనుమంతరావు, డాక్టర్ ప్రసాద్ పోటీలను పర్యవేక్షించారు. స్మార్ట్ ఇండియా హ్యాక్ థాన్ పోటీలు గురువారం ఉదయం 10 గంటల నుంచి శుక్రవారం రాత్రి 8 గంటల వరకు జరుగుతుందని కమిటీ చైర్మన్ డాక్టర్ శ్రీనాథ్ తెలిపారు.
addComments
Post a Comment