గోరంట్ల మాధవ్ వ్యవహారం పై విచారణ జరిపి చర్యలు తీసుకోండి..
- ప్రభుత్వానికి మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సూచన
- సత్వర విచారణ చేయాలని డీజీపీకి లేఖ
అమరావతి (ప్రజా అమరావతి):
ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ కోరారు. మహిళా లోకానికి తలవంపులు తెచ్చిన ఈ ఘటనలో నిజానిజాలను త్వరగా నిగ్గుతేల్చాలన్నారు. ఈమేరకు డీజీపీకి శనివారం లేఖరాసినట్లు ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
addComments
Post a Comment