సోమశిల, కండలేరు ప్రాజెక్టులు పరిధిలో చేపట్టిన ఇరిగేషన్ కెనాల్స్ పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

 

నెల్లూరు (ప్రజా అమరావతి);సోమశిల, కండలేరు ప్రాజెక్టులు పరిధిలో చేపట్టిన ఇరిగేషన్ కెనాల్స్  పెండింగ్ పనులను  త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు  తీసుకోవడం జరుగుతుంద


ని  రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జీ మంత్రి శ్రీ అంబటి రాంబాబు తెలిపారు. 


ఆదివారం  సాయంత్రం   జల వనరుల శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీ అంబటి రాంబాబు, రాష్ట్ర  వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి,  మాజీమంత్రి వెంకటగిరి నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి లతో కలసి కండలేరు జలాశయంను సందర్శించారు. జల వనరుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను మంత్రులు తిలకించారు. అనంతరం మంత్రులు శ్రీ అంబటి రాంబాబు, శ్రీ గోవర్ధన్ రెడ్డి,  ఇరిగేషన్, తెలుగుగంగ, సోమశిల ప్రాజెక్టు ల ఇంజనీరింగ్ అధికారులతో సమావేశమై జిల్లాలో జరుగుతున్న ఇరిగేషన్ కెనాల్స్ పనుల పురోగతిపై  సమీక్షించి  పెండింగ్ లో వున్న ఇరిగేషన్ కెనాల్స్ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. 


ఈ సంధర్భంగా మంత్రి శ్రీ అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ, జిల్లాలో  సోమశిల, కండలేరు ప్రాజెక్టులు పరిధిలో  చాలా ఏళ్ల నుండి  అపరిష్కృతంగా  వున్న ఇరిగేషన్ కెనాల్స్  పెండింగ్ పనులను  త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు  తీసుకోవడం జరుగుతుందన్నారు.  సుమారు 10, 15 సంవత్సరాలక్రితం పనులు ప్రారంభమై, పనులు నిలిచిపోయివుంటే వాటిని గుర్తించి తిరిగి ప్రతిపాదనులు  తయారు చేసి పంపాలని ఇరిగేషన్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు.  కృష్ణా నది పై వున్న ప్రాజెక్ట్స్ తో పాటు జిల్లాలోని సోమశిల, కండలేరు జలాశయాల్లో  పూర్తి సామర్ధ్యంతో  నీటిని నిల్వ చేసుకోవడం జరిగిందన్నారు. ఈ నెలాఖరు లోపు ముఖ్యమంత్రి శ్రీ  వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా మేకపాటి గౌతమ్ రెడ్డి  సంగం బ్యారేజీ ని, నెల్లూరు బ్యారేజీ ని ప్రారంభించుకోనున్నట్లు మంత్రి శ్రీ అంబటి రాంబాబు  తెలిపారు.


రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి  కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ,   జిల్లాలో వున్న రైతాంగానికి సమగ్రంగా సాగు నీటిని అందించడం జరుగుతుందన్నారు. జిల్లాలో సాగునీటి కి సంబంధించి పెండింగ్ లో ఉన్న అన్ని విషయాలు మీద రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించి వాటిని వెంటనే పూర్తి చేసి  జిల్లా రైతులకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అలాగే అటవీ అనుమతులు రాకపోవడంతో నిలిచిపోయిన సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్ కు ప్రత్యామ్నాయంగా లిఫ్ట్ ఇరిగేషన్ పనులు త్వరలో చేపట్టి ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు అందిస్తామని మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి  తెలిపారు.


వెంకటగిరి శాసన సభ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ,  గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గా స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వున్న సమయంలో  జిల్లా  రైతులకు అవసరమైన అనేక సాగునీటి ప్రాజెక్టులను జలయజ్ఞం కార్యక్రమం కింద  చేపట్టినట్లు తెలిపారు. ఐతే అప్పట్లో ఆయన శంకుస్థాపన చేసిన సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్ పనులు చాలా భాగం పూర్తి అయినప్పటికీ అటవీ అనుమతులు రాకపోవడంతో  పనులు నిలిచిపోవడం జరిగిందన్నారు.  ఇప్పుడు ముఖ్యమంత్రి శ్రీ  వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంత రైతుల సాగునీటి అవసరాలను  గుర్తించి ఎస్.ఎస్ కెనాల్ పనులు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. అనంతరం రాపూరు మండల వాసులు, రైతులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్ పనులు మొదలు పెట్టి పూర్తి చేయాలని,అలాగే కండలేరు జలాశయం నిర్మాణంలో సర్వము కోల్పోయి ప్రస్తుతం సాగునీరు లేక  ఇబ్బందులు పడుతున్న కండలేరు జలాశయం పక్కనే ఉన్న పోకూరుపల్లి, తానంచర్ల, సంక్రాంతిపల్లి, తాతిపల్లి, సానాయపాలెం, సెల్లటూరు ప్రాంతాలకి అవసరమయిన పోకూరుపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు వెంటనే మొదలు పెట్టేలా చర్యలు తీసుకోవాలని శాసన సభ్యులు శ్రీ రామనారాయణ రెడ్డి,  ఇరిగేషన్ మంత్రిని కోరారు.  


ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ  కుర్మానాథ్, తెలుగు గంగ ప్రాజెక్ట్ సి ఈ  శ్రీ హరినారాయణ రెడ్డి, సోమశిల, ఇరిగేషన్ ఎస్ ఈ లు  శ్రీ రమణారెడ్డి,  శ్రీ కృష్ణ మోహన్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్  శ్రీమతి చిగురుపాటి ప్రసన్న, కలువాయి మండల జడ్పిటిసి శ్రీ అనిల్ కుమార్ రెడ్డి, రాపూరు ఎం.పి.పి శ్రీ చెన్నుకృష్ణారెడ్డి,  పెంచలకోన దేవస్థానం చైర్మన్  శ్రీ చెన్ను తిరిపాల్ రెడ్డి, రాపూరు సొసైటీ చైర్మన్  శ్రీ చెన్ను భాస్కర్ రెడ్డి,  జిల్లాలోని ఇరిగేషన్ ఇంజనీర్ అధికారులు, మండలంలోని పలు గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 


Comments