నెల్లూరు, ఆగస్టు 18 (ప్రజా అమరావతి);
సహస్రదీపాలంకార సేవలో శ్రీ కోదండరాముడి అలంకారంలో శ్రీనివాసుడి అనుగ్రహం
నెల్లూరు ఎసి సుబ్బారెడ్డి స్టేడియంలో టీటీడీ నిర్వహిస్తున్న శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాల్లో మూడవ రోజైన గురువారం సాయంత్రం సహస్రదీపాలంకార సేవలో
శ్రీ కోదండరాముడి అలంకారంలో శ్రీనివాసుడు భక్తులను అనుగ్రహించారు. భక్తులు స్వామివారి వైభవాన్ని దర్శించి తన్మయత్వం చెందారు. చల్లటి సాయంత్రం వేళ ఆహ్లాదకర వాతావరణంలో స్వామివారు ఉల్లాసంగా ఊయలలో ఊగుతూ భక్తులకు కనువిందు చేశారు.
ముందుగా వేద పండితులు చతుర్వేద పారాయణం చేశారు. ఆ తరువాత టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ బృందం పలు అన్నమయ్య సంకీర్తనలు ఆలపించారు.
సాయంత్రం 6.30 నుంచి రాత్రి వేదిక చుట్టూ స్వామివారు తిరుచ్చిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు రాత్రి కైంకర్యాలు నిర్వహిస్తారు. రాత్రి 8.30 నుంచి 9.00 గంటల వరకు ఏకాంతసేవ జరుగనుంది.
ఈ కార్యక్రమంలో ఎంపి , కార్యక్రమ నిర్వాహకులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి , టీటీడీ ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్ష్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు
ఇదిలా ఉండగా , గురువారం ఉదయం నమూనా ఆలయంలో వందలాదిమంది బాలబాలికలు
శ్రీకృష్ణుడు గోపికలు వేషధారణలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
addComments
Post a Comment