సామాన్యుడు మహాత్ము డయ్యాడు-ఆయన వారసులుగా మనం గర్వించాలి : సి జె ఐ
తిరుపతి, ఆగస్టు 19 (ప్రజా అమరావతి): అహింసా మార్గంలో దీర్ఘకాలిక స్వాతంత్ర ఉద్యమం నడిపిన సామాన్యుడు గాంధీ గారు మహాత్ముడయ్యాడని, నేడు అయన వారసులుగా మనం గర్వించాల్సిన విషయం అని భారత ప్రధాన న్యాయమూర్తి శ్రీ నూతలపాటి వెంకటరమణ అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక రాహుల్ కన్వెన్షన్ సెంటర్ లో సత్యశోధన మహాత్ముని ఆత్మకథ అనువాదం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి ముఖ్యాతిధిగా పాల్గొన్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ మానవుడు మహాత్మునిగా మారిన గాంధీ చరిత్రను వాస్తవాలకు అనుగుణంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రచురించి భవిష్యత్ తరాలకు అందించాలనే తపన స్థానిక శాసన సభ్యులు భూమన కరుణాకర రెడ్డికి రావడం సంతోషమని , అభినందిస్తున్నానని అన్నారు. తిరుపతి పట్టణంలో మహాత్మాగాంధీ గారు రెండు సార్లు పర్యటించారని తిరుపతి వాసులు అదృష్టవంతులని అన్నారు. నేడు కరుణాకరరెడ్డి పుస్తక అనువాదం ప్రచురించి ఆవిష్కరణకు ముఖ్యాతిధిగా పిలవడం సంతోషంగా వుందని అన్నారు. ప్రపంచంలో అనేకమందికి గాంధీ గారి అహింస శాంతి మార్గాలతో చెడును గట్టిగా ప్రతిఘటించి ద్వేషంతో కాకుండా ప్రేమతో , రక్తపాతం లేకుండా దీర్ఘకాలిక ఉద్యమంతో స్వాతంత్ర్యం ఉద్యమంలో పోరాడారని తెలుసని అన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో నిజం చెప్పడం ఎంత కష్టమో , చేసిన తప్పును అందరి సమక్షంలో సభా వేదికగా ఒప్పుకోవడం అనేది భూమన కరుణాకరరెడ్డి నిబద్దతలో నాకు మాటలు రావడం లేదు, ఏవిధంగా గౌరవించాలో కూడా అర్థంకాలేదు అన్నారు. నాకు ఆప్తమిత్రులు భూమన , పిన్నవయస్సులో తీవ్రవాద వామపక్షాన నిలిచి రెండు సంవత్సరాల జైలు జీవితం అతి పిన్న వయస్సులో అనుభవించి, అక్కడే అనేక మంది సాహితీ వేత్తల విప్లవకారులతో గడిపారని అన్నారు. ఆ స్పూర్తితో ప్రజల సమస్యలను విశాల దృక్పదంతో పార్టీల కతీతంగా, నిర్మొహమాటంగా చెప్పడం అనేది సామాన్య విషయం కాదు, ఎప్పడు నావద్దకు వచ్చినా సమాజ శ్రేయస్సు గురించి ప్రసావిస్తారే తప్ప నాకిది చేసిపెట్టు అని ఏనాడు అడగలేదు అన్నారు. నా అభిమాని, స్నేహితుడు, ఆప్తమిత్రుడు అపూర్వ సహోదరుడు రాజకీయాల్లో న్యాయకత్వ విలువలు కలిగిన వ్యక్తి భూమన అని, అన్నిరకాల మనం అండగా వుండాలని కోరుకుంటున్నానని అన్నారు. భూమన అధ్వర్యంలో తిరుపతిలో భాషా సాహితీ సదస్సు జరపాలని ఆ కార్యక్రమానికి వస్తానని అన్నారు.
స్వాగాతోపాన్యాసంలో భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ మహర్షి మహాత్ముడు గాంధీ చరిత్ర ఒక
తరంతో ముగిసిపోరాదని భావితరాలకు అందించాలని ఈ చిన్న ప్రయత్నంచేసి భారత దేశ సర్వోన్నత అధికారి చేతులమీదుగా ఆవిష్కరణకు ఆహ్వానించానని ఈ చిన్న కార్యక్రమానికి వచ్చినందుకు కృతజ్నతలని అన్నారు. నైతికత లేని రాజకీయం ప్రమాదకరమని, ప్రకృతిలో కావలసినంత సంపద వుందని మానవుని అత్యాసతో మింగేస్తున్నారని, మనం కాపలాదారులే కానీ ... హక్కుదారులు కాదని , నినాదాలకు గాంధీ గారిని వాడుకుని వదిలేయరాదని సిద్దాంతాల ఆచరణ వుండాలని అన్నారు.
అనంతరం సభలో పుస్తక ఆవిష్కరణ చేపట్టారు. గాంధీ ప్రతిమను భూమన , ధర్మారెడ్డిలు సి జె ఐ కి బహుకరించారు.
ఈ ఆవిష్కరణ సభలో తిరుపతి, చిత్తూరు , అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు కె వెంకటరమణా రెడ్డి, ఎం.హరినారయణన్ పి.ఎస్.గిరీషా, నగరపాలక మేయర్ శిరీషా, కమిషనర్ అనుపమా అంజలి , టిటిడి ఇఒ ధర్మా రెడ్డి, సాహితీ వేత్తలు, ప్రొఫెసర్లు, అధ్యాపకులు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
addComments
Post a Comment