*తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని సతీ సమేతంగా దర్శించుకున్న గౌ.భారత ప్రధాన న్యాయమూర్తి*
తిరుపతి , ఆగష్టు 19 (ప్రజా అమరావతి): తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారిని సతీ సమేతంగా దర్శించుకున్న గౌ.భారత ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకటరమణ. వీరికి టీటీడీ ఈ ఓ ధర్మా రెడ్డి, జే ఈ ఓ వీరబ్రహ్మం అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికి అమ్మవారి దర్శన అనంతరం శేష వస్త్రంతో ఆలయ మర్యాదలతో వేదాశీర్వచనం పలికి ప్రసాదాలు అందజేశారు. వీరితో పాటు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయన్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు ఏ వి రవీంద్రబాబు, దుప్పాల వెంకటరమణ, చక్రవర్తి విజయలక్ష్మి, తిరుపతి జిల్లా ఇంఛార్జి జస్టిస్ కొంగర విజయ లక్ష్మి, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు లలితా కనిగేటి, చిత్తూరు జిల్లా ప్రిన్సిపల్ జడ్జి భీమ్ రావు, తిరుపతి ఎడిజే మరియు చీఫ్ ప్రోటోకాల్ జస్టిస్ వీర్రాజు, కోటేశ్వర రావు ప్రోటోకాల్ మేజిస్ట్రేట్ తదితర న్యాయమూర్తులు ఉన్నారు.
addComments
Post a Comment