విజయవాడ (ప్రజా అమరావతి);
" హర్ ఘర్ తిరంగా " జరుపుకుందాం.. ఘనంగా..
దేశ స్వాతంత్ర్య అమృతోత్సవాలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న " హర్ ఘర్ తిరంగా " రాష్ట్రం అంతటా ఘనంగా నిర్వహించుకుంటున్నామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ శ్రీ టి. విజయ కుమార్ రెడ్డి అన్నారు.
విజయవాడ ఆర్.టి.సి. కాంప్లెక్స్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లోని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో శుక్రవారం కమిషనర్ విజయ కుమార్ రెడ్డి “ హర్ ఘర్ తిరంగా “ కార్యక్రమంలో భాగంగా ఉద్యోగులకు జాతీయ జెండాలు అందించారు. ఈ సందర్భంగా కమిషనర్ విజయ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జాతీయోద్యమ స్పూర్తితో ప్రజలంతా " హర్ ఘర్ తిరంగా " కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారని దీనిలో భాగంగా రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రతి ఇంటికీ జాతీయ జెండాను అందించాలని రాష్ట్రం లోని నగర, పట్టణ, గ్రామా ప్రాంతాలలో, పాఠశాలల్లో, కళాశాలల్లో, ప్రభుత్వ కార్యాలయాలలో జాతీయ ఉద్యమ స్ఫూర్తి ప్రతిబింబించేలా సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారన్నారు. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలన్నారు. " ఆజాదీ కా అమృత్ మహోత్సావం " లో భాగంగా ప్రతి ఇంటా జెండా ఎగరాలి - ప్రతి మదిలో స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తిని నింపాలని కమిషనరు అన్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్దించి ఆగష్టు 15, 2022 నాటికి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో ప్రజలకు సుపరిపాలన అందిస్తూ " నవరత్నాలు " కార్యక్రమం ద్వారా అర్హులైన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించే కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత తీసుకు వెళ్లాలని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పధకాల ఫలాలను ప్రజలకు చేరువ చేయుటలో వారధిగా ఉంటూ సమాచార శాఖ అధికారులు, ఉద్యోగులు కీలక పాత్ర పోషించాలని అన్నారు. రాష్ట్రంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఆగష్టు 13 నుండి 15 వరకూ ఘనంగా నిర్వహిస్తున్నామని కమిషనర్ శ్రీ టి. విజయ కుమార్ రెడ్డి అన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డైరెక్టర్ శ్రీమతి ఎల్. స్వర్ణలత, జాయింట్ డైరెక్టర్ లు పి. కిరణ్ కుమార్, టి. కస్తూరి భాయి, సమాచార శాఖ రీజనల్ ఇన్ఫర్ మేషన్ ఇంజినీర్ కృష్ణా రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ లు పి. తిమ్మప్ప, కె. సదారావు, అసిస్టెంట్ డైరెక్టర్ లు జి.వి. ప్రసాద్, టి. వెంకట రాజు గౌడ్, ఎమ్. ఏ. రామచంద్ర మూర్తి, ఎమ్. భాస్కర నారాయణ, సమాచార శాఖ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment