నెల్లూరు, (ప్రజా అమరావతి);
చేనేత వృత్తిని గిట్టుబాటు చేస్తూ, నేతన్నలు తమ కాళ్ళ మీద తాము నిలబడేలా వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం ద్వారా చేనేత కుటుంబాలకు ఆర్ధిక తోడ్పాటు
కల్పిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు.
"వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం" కింద వరుసగా నాలుగో ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 80,546 మంది నేతన్నలకు ఒక్కొక్కరికి 24,000/- రూపాయలు చొప్పున 193.31 కోట్ల ఆర్థిక సహాయాన్ని గురువారం కృష్ణా జిల్లా, పెడనలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలలో నేరుగా జమ చేశారు.
అందులో బాగంగా కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో జరిగిన వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద నాలుగో ఏడాది నేతన్నలకు ఆర్థిక సహాయం అందచేసే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి వెంకట నారాయణమ్మ, డి.ఆర్.డి.ఎ పిడి శ్రీ సాంబశివారెడ్డి, జిల్లా చేనేత, జౌళి శాఖాధికారి శ్రీ ఆనంద కుమార్, వై.ఎస్.ఆర్ నేతన్న నేస్తం లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు, వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద జిల్లాలోని 3,826 మంది లబ్దిదారులకు 9.18 కోట్ల రూపాయల మెగా చెక్కును అందచేశారు.
జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల కార్యక్రమం ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలను క్యాలెండర్ రూపంలో తూచా తప్పకుండా అమలు చేయడం జరుగుచున్నదన్నారు. అందులో భాగంగా ఈ రోజు "వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం" కింద రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన చేనేత కార్మికులకు 4వ విడత ఆర్ధిక సహాయం అందచేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగిందన్నారు. జిల్లాలో ఈ పధకం కింద 3,826 మంది చేనేత కార్మికులకు 9.18 కోట్ల రూపాయలు ఆర్ధిక సహాయాన్ని అందచేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. పెట్టుబడి సాయం కింద, వృతి నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి, వారి జీవన పరిస్థితులను మెరుగు పర్చుకోవడానికి ఈ ఆర్ధిక సహాయం ఎంతగానో తోడ్పడుతుందని కలెక్టర్ అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా చేనేత కార్మికులను ప్రోత్సహించేందుకు జిల్లాలోని చేనేత కార్మికులను గుర్తించి వారం రోజుల పాటు 30 స్టాల్స్ తో చేనేత వస్త్ర ప్రదర్శనను నెల్లూరులో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ చేనేత వస్త్ర ప్రదర్శనకు మంచి స్పందన రావడంతో పాటు సుమారు 23 లక్షల రూపాయల మేర వ్యాపారం జరిగిందని కలెక్టర్ తెలిపారు. చేనేత కార్మికులను ప్రోత్సహిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్నీ చర్యలు తీసుకుంటున్నదని, ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించి వారికి తోడ్పాటు కల్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు.
1. శ్రీమతి పి. లావణ్య, నారాయణరెడ్డిపేట, నెల్లూరు రూరల్ మండలం ( వై.ఎస్.ఆర్ నేతన్న నేస్తం పథకం లబ్ధిదారులు) :
వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం ద్వారా ప్రభుత్వం మూడు విడతలుగా 24 వేల రూపాయలు వంతున ఆర్ధిక సహాయాన్ని అందించడం జరిగిందని, ఈ రోజు 4వ విడత కింద మరో 24 వేల రూపాయలు ఆర్ధిక సహాయాన్ని అందించడం వలన చేనేత వృతిపై జీవనం సాగిస్తున్న మా కుటుంబానికి ఎంతగానో ఉపయోగపడుతున్నదని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. మా కుటుంబం వితంతు పింఛన్, అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన పధకాలు పొందుతున్నది. వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం ద్వారా మాకు ఆర్ధిక తోడ్పాటు కల్పిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసారు.
2. శ్రీమతి ఎస్. వెంకట లక్ష్మీ, నారాయణరెడ్డిపేట, నెల్లూరు రూరల్ మండలం (వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం లబ్ధిదారులు) :
మా కుటుంబం చేనేత వృతిపై ఆధారపడి జీవిస్తున్నాం. వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం ద్వారా ప్రభుత్వం అందచేస్తున్న ఆర్ధిక సాయంతో.. వ్యాపారాన్ని మరింత ఆభివృద్ధి చేసుకుంటున్నాను. ఈ పధకం కింద మూడు విడతలు ఆర్ధిక సహాయాన్ని పొందడం జరిగిందని, నేను వితంతు పింఛన్, జగనన్న విద్యా దీవెన పొందుతున్నాను. ప్రభుత్వ సంక్షేమ పథకాలు మా లాంటివాళ్లకు ఎంతో ఉపయోగ పడుతున్నాయి. వై.ఎస్.ఆర్ నేతన్న నేస్తం పథకం నా కుటుంబానికి ఎంతో తోడుగా నిలిచింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
3. శ్రీ సీతా సుధాకర్, వీవర్స్ సొసైటి ఛైర్మన్, నారాయణరెడ్డిపేట, నెల్లూరు రూరల్ మండలం (వై.ఎస్.ఆర్ నేతన్న నేస్తం పథకం లబ్ధిదారులు) :
చేనేత కార్మికుల కష్ట నష్టాలను, బాధలను అర్ధం చేసుకొని నేతన్నకు అండగా వుంటూ వై.ఎస్.ఆర్ నేతన్న నేస్తం పథకం కింద సంవత్సరానికి 24 వేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందచేయడం పట్ల ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి జీవితాంతం రుణపడి వుంటామన్నారు. మా కుటుంబానికి జగనన్న విద్యా దీవెన పధకం కూడా వస్తున్నది. మా వృత్తి అవసరాల నిమిత్తం అప్పుల కోసం బయట వ్యక్తుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయిందని, మాలాంటి వాళ్లకు అండగా నిలిచిన రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
addComments
Post a Comment