తెనాలిలో అన్నా క్యాంటీన్ ను ప్రారంభించిన మాజీ మంత్రులు ఆనందబాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్

 తెనాలి  (ప్రజా అమరావతి);


      గత టిడిపి ప్రభుత్వంలో నిరుపేదలైన వారికి కడుపు నిండా భోజనం పెట్టడం కోసం నాడు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగినది.. నేడు దుర్మార్గమైన ప్రభుత్వంలో పేదలను ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు..


ఇకనుండి ప్రతిరోజు స్థానిక తెనాలి పట్టణంలోని మార్కెట్ సెంటర్లో మునిసిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహం దగ్గర అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగినది.. ఈ అన్న క్యాంటీన్ ద్వారా ప్రతిరోజు నిత్యం నిరుపేదలైన వారికి ఆకలి తీర్చడమే ప్రధాన లక్ష్యం...

Comments