తాడేపల్లి (ప్రజా అమరావతి);
*స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో కదం తొక్కిన విద్యార్థులు*
*సుందరయ్యనగర్లో వందలాదిమందితో భారీ ప్రదర్శన*
*జెండా ఊపి ర్యాలీనిప్రారంభించిన మణిపాల్ హాస్పటల్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్,మనోజక్కుమార్*
*2కి.మీ. మేర ఉత్తేజంగా,ఉత్సాహంగా సాగిన ప్రదర్శన*
*ప్రదర్శనపైపూలజల్లు కురిపించిన ప్రజలు*
*అల్లూరిసీతారామరాజులకు హారతిపట్టిన ప్రజలు*
సుందరయ్య సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని సుందరయ్యనగర్
లో జరిగిన స్థానికంగా ఉన్న వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు జరిపిన ప్రదర్శన స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని రగిలించింది. స్వాతంత్ర సమరయోధుడు పుచ్చలపల్లి సుందరయ్యనగర్ పేరుమీద వెలిసిన కరకట్టు మీద 720మంది విద్యార్థినీ విద్యార్థులు కదం తొక్కారు. ప్రదర్శన మొదలైన దగ్గర నుండి చివరి వరకు 2కి.మీ. మేర ఉత్సాహంగా, ఉత్తేజంగా సాగింది. 125వ మంది అల్లూరి సీతారామరాజులు వేషధారణలతో ఉద్యమస్ఫూర్తిని కలిగించారు.75ఏళ్ళ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 75 మంది బాలికలు జాతీయ జెండాలు పట్టుకొని ప్రదర్శనలో ముందుభాగాన నడిచారు.వారి వెనుక 125 మంది అల్లూరి సీతారామరాజు వేషదారణ వేసిన విద్యార్థులు కదిలారు. విల్లంబులు చేత
బూని బాణాలు ఎక్కుపెట్టి సీతారామరాజులు నడుస్తుంటే ఆనాటి మన్నెంలో జరిగిన ఉద్యమ స్ఫూర్తి గుర్తుకుతెచ్చుకున్నారుప్రదర్శన ముందు నడిచిన బాలబాలి
కలు 75 మంది చేతుల్లో జాతీయ జెండాలు,తలపై ప్రత్యేకంగా ధరించిన కిరీటాలతో భరతమాతను తలపించారు.2కి.మీ. మేర సాగిన ప్రదర్శనపై అడుగడుగునా జనం రోడ్డుపక్కన నిలబడి పూలవర్షం కురిపించారు. హారతులు పట్టారు. ముందుగా మణిపాల్ ఆసుపత్రి ఆవరణలో మణిపాల్ హాస్పటల్ మెడికల్ సర్వీసెస్
డాక్టర్ మనోజక్కుమార్ జాతీయ జెండా ఊపి ప్రదర్శనను ప్రారంభించారు. ప్రదర్శన ముందుభాగాన డాక్టర్ మనోజ్కమార్తో పాటు మాకినేని బసవపున్నయ్య
విజ్ఞాన కేంద్రం కార్యదర్శి పిన్నమనేని మురళికృష్ణ, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి అనీలక్కుమార్, ప్రజానాట్యమండలి బాధ్యులు గాదె సుబ్బారెడ్డి, సుందరయ
సేవా సమితి కార్యకర్తలు పాల్గొన్నారు 750మందితో జరిగిన ఈ ప్రదర్శన ఈ ప్రాంతంలో జరిగిన అపూర్వమైన ప్రదర్శనగా స్థానికులు అభివర్ణించారు. సుందరయ్య నగర్
కట్ట పొడవునా ప్రజలు ఇళ్ళలో నుండి బయటకు వచ్చి ప్రదర్శనను తిలకించారు.
ఈ సందర్భంగా మణిపాల్ ఆసుపత్రి వారు విద్యార్థినీ విద్యార్థులకు స్నాక్స్, మంచి నీరు
అందించారు. సుందరయ్యనగర్లోని ప్రతిభ హైస్కూల్, సింధు నికేతన్ ఆదర్శ పాఠశాల, నేతాజి బాలవిద్యాలయం, ప్రగతి బాలవిద్యాలయం, లిటిల్ ఫ్లవర్స్
కాన్వెంట్ నుండి విద్యార్థులు, ఉపాధ్యాయులు కిలోమీటర్ల మేర నడుచుకుంటూ ముందుగా మణిపాల్ హాస్పటల్ వద్దకు చేరుకున్నారు. అక్కడ నుండి సుందరయ్య
నగర్ కట్ట తూర్పు వైపు ఉన్న రామచంద్రరావు కొట్టు వరకు సాగిన ప్రదర్శనలో విద్యార్థినీ విద్యార్థులతోపాటు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సుందరయ్య సేవా సమితి కార్యకర్తలు తోడై ప్రదర్శన అపూర్వంగా సాగింది.
ఈ గాలి మాది....ఈ భూమి మాది... నీరు మాది... మధ్యలో బ్రిటీషోడి పెత్తనమేంటి.... స్వాతంత్య్ర కాంక్షతో రగిలిపోయిన అల్లూరి సీతారామరాజు
ర్యాలీ ప్రారంభిస్తూ మాకినేని బసవపున్నయ్య విజ్ఞానకేంద్రం కార్యదర్శి పిన్నమనేని మురళికృష్ణ
మా దేశంలో స్వచ్ఛమైన గాలిమాది.... నీరు మాది. భూమి మాది... మా భూమి మీద నీ పెత్తనమేంటని బ్రిటీషోళ్ళను గడగడలాడించి దేశానికి స్వాతంత్ర్యం ప్రకటించి, బ్రిటీషోళ్ళుదేశం విడిచి వెళ్ళే విధంగా ఉద్యమస్ఫూర్తి కొనసాగించిన అల్లూరి సీతారామరాజును నేటి యువతరం ఆదర్శంగా తీసుకోవాలని
మాకినేని బసవపున్నయ్య విజ్ఞానకేంద్రం కార్యదర్శి పిన్నమనేని మురళికృష్ణ కోరారు. బుధవారం స్ఫూర్తి ఉత్సవాల్లో భాగంగా ర్యాలీని ప్రారంభించే ముందు విద్యా
ర్థినీ విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్దలనుద్దేశించి ఆయన మాట్లాడారు. రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం మీద పోరాటం నడిపిన అల్లూరు వారసులుగా
తయారవ్వాలని పిలుపునిచ్చారు. ధైర్యం, త్యాగం మేళవించి దాడిచేస్తామని చెప్పి రంపచోడవరం, దేవీపట్నం తదితర పోలీస్టేషన్లపై దండెత్తిన ధీరోదాత్తుడు సీతారా
మరాజు అని కొనియాడారు.వివిధ జాతులు, కులాలు, మతాలు గల భారతదేశం ప్రస్తుతం ప్రమాదంలో పడిందని హెచ్చరించారు.లౌకిక రాజ్యాంగానికి తూట
పొడుస్తున్నారని విమర్శించారు.దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి ముందుకు రావాలని ప్రజానీకానికి పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి మోడీ జిఎస్టి తగ్గించాలని స్కూల్ పిల్లలు వాడే పుస్తకాలు,పెన్సిళ్ళు తగ్గించేవిధంగా ఉత్తరాలు వ్రాయాలని విద్యార్థినీ విద్యార్థులను కోరారు. అలాగేనవరత్నాల్లాంటి ప్రభుత్వం రంగ సంస్థలను అమ్మొద్దని కూడా ప్రధానమంత్రికి లేఖలు వ్రాయాలని చెప్పారు. అందుకు జగన్ మావయ్య విద్యార్థులకు కూడా సహకరించాలని కోరుతూ విద్యా
ర్థులు ఉత్తరాలు వ్రాయాలని పిలుపునిచ్చారు. గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు గాంధీ, సుందరయ్యలాంటి మహనీయుల జీవితాలను అధ్యయనం చేయాలని ఆయన
కోరారు.భూస్వామ్య కుటుంబంలో పుట్టి పేదవారికి సేవ చేయడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఒక వీరుడు మరణిస్తే వేలవీరులు ఉద్భవిస్తారన్న చందంగా సుందరయ్య నగర్లో స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తి అల్లూరి సీతారామరాజుల ప్రదర్శన చూస్తుంటే తనకు ఆ అనుభూతి కలిగిందని చెప్పారు.
addComments
Post a Comment