బోధన వైద్య కళాశాల పి ఈ బి స్ట్రక్చర్ పనులను తనిఖీ చేసిన ప్రిన్సిపల్ కార్యదర్శి
రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి): 


* బోధన వైద్య కళాశాల  పి ఈ బి స్ట్రక్చర్ పనులను తనిఖీ చేసిన ప్రిన్సిపల్ కార్యదర్శి


 


మెడికల్ కాలేజీ పనులపై క్షేత్ర స్థాయి లో పర్యటించడం జరిగింది.


- ఎం. టి కృష్ణ బాబు 


రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా బోధనా ఆసుపత్రుల నిర్మాణం చేపట్టడం జరుగుతోందని, మరింత మెరుగ్గా వైద్య సేవలు మంజూరు చేయడం జరిగిందని మెడికల్ ఎడ పేర్కొన్నారు 


 గురువారం రాజమహేంద్రవరంలో నిర్మాణంలో ఉన్న భోధనా వైద్య కళాశాల  "మేక్ షిఫ్ట్ - పిఈబి" పనుల పురోగతిని  సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్ టి కృష్ణ బాబు మాట్లాడుతూ రాజమహేంద్రవరం లోని జిల్లా ప్రధాన ఆస్పత్రి ని పూర్తి స్థాయి సర్వజన ఆసుపత్రి గా అభివృద్ధి చేసి మెరుగైన వైద్యం అందించడం కోసం చర్యలు తీసుకుంటా మన్నారు. తూర్పు గోదావరి జిల్లా   ఇదే ఆసుపత్రి ప్రాంగణంలో  రూ. 475 కోట్లతో 150 మంది వైద్య విద్యార్థుల కోసం బోధనా వైద్య కళాశాల, ఆసుపత్రి నిర్మాణం పనులను చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఇంజనీరింగ్ అధికారులకు, మేఘా కన్స్ట్రక్షన్ కంపెనీ వారికి  నిర్ణీత సమయం లోగా చేయాలని ఆదేశించడం జరిగిందన్నారు.  రాబోయే మాసాల్లో జాతీయ మెడికల్ కౌన్సిల్ బృందం బోధనాసుపత్రి  పనులను పరిశీలించేందుకు పర్యటన చేయునున్నదాని తెలియచేశారు.   అంతకు ముందే పనులను పూర్తి చేయాల్సి ఉండ గా అదిశలో పనులు పురోగతి లో ఉన్నాయన్నారు. అందులో భాగంగా మేక్ షిఫ్ట్ తరహాలో మెడికల్ కాలేజీ  పనులను జాతీయ మెడికల్ కౌన్సిల్ నిర్దేశించిన మార్గదర్శకాలకు మేరకు అత్యంత ప్రాధాన్యత తో చేపడుతున్నట్లు పేర్కొన్నారు.భవన నిర్మాణ మ్యాప్ ను , ప్రి- ఇంజనీరింగ్ భవనం లో ఇప్పటి వరకు జరిగిన పనులపై దశల వారీగా చేపడుతున్న వివరాలను కృష్ణ బాబుకి అధికారులు వివరించారు.   ముఖ్య ఆసుపత్రికి అనుసంధానంగా  తదితర భవన నిర్మాణ పనులు కూడా చేపట్టడం జరుగుతుందని ఇంజనీరింగ్ అధికారులు ఆయనకు వివరించారు. 


ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్య కళాశాల రాజమహేంద్రవరం  ప్రిన్సిపాల్ డాక్టర్ బి ఎస్ ఎస్ ఎస్ఐ డి సి వెంకటేశ్వర్లు  , మెడికల్ కాలేజ్ డివిజన్  ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్  కె.విజయభాస్కరరెడ్డి, సూపరింటెండెంట్ డాక్టర్ ఎమ్.ఎస్.ఆర్. రమేష్, ఎస్ ఈ ఏ పి సర్కిల్ పి.అశోక్ కుమార్, డి ఈ ఈ ఎస్.కృష్ణారావు, మైల్ అధ్యక్షులు గోవర్ధన రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.  


ఈసందర్భంగా ఇప్పటి వరకు జరిగిన పనుల పురోగతిపై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకించారు Comments