అత్యంత వైభవంగా శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు - టీటీడీ ఈవో శ్రీ ఎ వి ధర్మారెడ్డి

    నెల్లూరు, , ఆగస్టు 16 (ప్రజా అమరావతి);


అత్యంత వైభవంగా శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు


- టీటీడీ  ఈవో  శ్రీ  ఎ వి ధర్మారెడ్డి  నెల్లూరు నగరంలో టిటిడి ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సౌజన్యంతో మంగళవారం నుంచి నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయని టిటిడి ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి చెప్పారు.


        ఇక్కడి ఎసి సుబ్బారెడ్డి స్టేడియంలో ప్రారంభమైన శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాల్లో భాగంగా శ్రీవారి సహస్ర దీపాలంకరణ సేవ ఆయన మీడియాతో మాట్లాడారు. నెల్లూరు నగరంలో వైభవోత్సవాలకు భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దర్శించుకుంటున్నారని ఆయన చెప్పారు. తిరుమల ఆలయంలో రోజువారీ నిర్వహించే నిత్యసేవలు,  వారపు సేవలను భక్తుల కోసం ఇక్కడి నమూనా ఆలయంలో నిర్వహిస్తున్నామని, భక్తులకు తిలకించి తరించాలని కోరారు.

 

Comments