రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెద్ద పీట వేశారుకృత్తివెన్ను (కొమళ్లపూడి): ఆగస్టు 20, (ప్రజా అమరావతి);


*రూ.24.75 లక్షలతో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి భవన నిర్మాణం ... మంత్రి జోగి రమేష్*


కొమళ్లపూడి గ్రామంలో రూ.24.75 లక్షలతో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ భవనం మరియు గిడ్డంగి నిర్మిస్తున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తెలిపారు.


శనివారం ఆయన కృత్తివెన్ను మండలం, కొమళ్లపూడి గ్రామంలో శ్రీ కృష్ణా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ భవనం మరియు గిడ్డంగి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెద్ద పీట వేశారని, దీనిలో భాగంగానే నేడు రైతుల కోసం రూ. 24.75 లక్షల నిధులతో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ భవనంతో పాటు గిడ్డంగి నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు. సకాలంలో నిర్మించి భవనాలను అందుబాటులోనికి తీసుకురానున్నట్లు మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో కృత్తివెన్ను మండలం జెడ్పీటీసీ మైలా రత్న కుమారి, ఎంపీటీసీ కూనసాని మహాలక్ష్మీ, ఎంపీపీ కూనసాని గరుడ ప్రసాద్, కోఆపరేటివ్. బ్యాంకు అధ్యక్షులు కూనసాని లక్ష్మోజి, గ్రామ సర్పంచ్ ప్రత్తిపాటి అనూష, వైఎస్సార్ సీపీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


*మాట్లం గ్రామంలో..*

 కృత్తివెన్ను మండలం, మాట్లం గ్రామంలో రూ.24.75 లక్షల నిధులతో నిర్మించనున్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ భవనం మరియు గిడ్డంగి నిర్మాణాలకు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ శంకుస్థాపన చేశారు.


శనివారం ఆయన కృత్తివెన్ను మండలం, మాట్లం గ్రామంలో రూ.24.75 లక్షల నిధులతో నిర్మిస్తున్న శ్రీ దేశోద్ధారక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ పరపతి భవనం మరియు గిడ్డంగి నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. త్వరలో గ్రామంలోని చెరువు విస్తరణ పనులు, రోడ్ల నిర్మాణ పనులు చేపడతామని మంత్రి తెలిపారు. 

ఈ నెల 23 న రాష్ట్ర స్థాయిలో నేతన్న నేస్తం నిధుల పంపిణీ కార్యక్రమం పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెడనకు రానున్నారని, పెడన నియోజకవర్గ ప్రజలు తప్పనిసరిగా హాజరయ్యి సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మంత్రి ప్రజలను కోరారు.


ఈ కార్యక్రమంలో కృత్తివెన్ను మండలం జెడ్పీటీసీ మైలా రత్న కుమారి, పిఎసిఎస్ చైర్మన్ తమ్ము శ్రీనివాసరావు, ఎంపీటీసీ రేవు సత్యనారాయణ, మాట్లం, చినగొల్లపాలెం సర్పంచులు తిరుమాని పాండురంగారావు, పెనుమాల సునీల్ వైఎస్ఆర్ సీపీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


Comments