నిరంతరం ఎండ తెలియక కాళ్లు చేతులు ఆడిస్తూ శ్రమించే నేతన్నలకు నేతన్న నేస్తం చేతోడు వాదోడుగా నిలుస్తుంది


రామచంద్రాపురం, ఆగస్టు 27 (ప్రజా అమరావతి);

నిరంతరం ఎండ తెలియక  కాళ్లు చేతులు ఆడిస్తూ శ్రమించే నేతన్నలకు నేతన్న నేస్తం చేతోడు వాదోడుగా నిలుస్తుందని


రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు చెల్లు బోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ తెలిపారు.

శనివారం రామచంద్రపురం( చోడవరం) విజయ ఫంక్షన్ హాల్ లో నేతన్నల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రితో పాటు కే గంగవరం, కాజులూరు, రామచంద్రాపురం మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు, నేతన్న నేస్తం లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆకలి వేసినప్పుడు పస్తులు వుండి ఆత్మాభిమానం తో బ్రతికే నేతన్నల కష్టనష్టాలను  సుదీర్ఘ పాదయాత్రలో గుర్తించి ముఖ్యమంత్రి అయిన తర్వాత నేతన్న నేస్తం పథకం ద్వారా వారి ఆకలి కేకలు  తీర్చిన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దక్కిందని తెలిపారు

మార్పు ద్వారా భద్రత , భరోసా కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని  ఆ తరహాలో సచివాలయ, వాలంటరీ వ్యవస్థ ద్వారా ఎక్కడ మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు వెళ్లడం గొప్ప విషయమన్నారు.

జీవన స్థిరత్వానికి పునాది వేసిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దక్కుతుందన్నారు. జీవన రక్షణకు ఇండ్లు, పిల్లల చదువులకు అమ్మఒడి విద్యా దీవెన వసతి దీవెన ఆరోగ్యశ్రీ తోపాటు రైతు భరోసా ఆసరా 45 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ లు ఇస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో జరుగుతున్న పాలనకు మనం సాక్షులుగా నిలుస్తామని మంత్రి పేర్కొన్నారు.

రామచంద్రపురం నియోజకవర్గ పరిధిలోని చేనేత వర్గాలు ఒకే తరహాలో దుప్పట్లు వేస్తున్నారని, నూతన ఒరవడి లతో ముందుకు రావాలని తన వంతు కృషి చేస్తానని మంత్రి తెలిపారు. ఇటీవల గడపగడపకు మన ప్రభుత్వం లో భాగంగా అద్దం పల్లి వంటి గ్రామాల్లో పర్యటన సందర్భంగా చేనేత వస్త్రాలు బకాయిల గురించి పలువురు తన దృష్టికి తీసుకొని వచ్చారన్నారు. దీనిపై  ఉన్నతాధికారులతో మాట్లాడి రావలసిన బకాయిలు ఆయా సొసైటీలకు సుమారు ఏడు కోట్ల రూపాయలు వచ్చే విధంగా కృషి చేయడం జరిగిందన్నారు బకాయిలు పొందిన సొసైటీ వర్గాలు ఎంతో ఆనందం వ్యక్తం చేశారని మంత్రి తెలిపారు

నేతన్న నేస్తం లో భాగంగా నాలుగో విడత గా రామచంద్రపురం నియోజకవర్గం లోని రామచంద్రపురం మండలానికి 343

కే గన్నవరం 204, కాజులూరు 90 మొత్తం 637 మంది చేనేత కార్మికులకు ఒక్కొక్కరికి 24 వేల రూపాయల చొప్పున ఒక కోటిఇరవై రెండు లక్షల రూపాయలు వారి ఖాతలకు బదిలీ అయ్యాయని మంత్రి వెల్లడించారు.



ఈ సందర్భంగా పలువురు ప్రజా ప్రతినిధులు, చేనేత సంఘం నాయకులు ప్రభుత్వం నేతన్న హస్తం వల్ల జరుగుతున్న ప్రయోజనం, బకాయిలు విడుదల చేస్తూ ఉండడంతో చేస్తున్న చొరవను ప్రత్యేకంగా ప్రశంసించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి లబ్ధిదారులు పాలాభిషేకం చేశారు.


Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
बर्खास्त होंगे उत्तराखंड विधानसभा सचिवालय के 228 कर्मी, हाईकोर्ट ने फैसला सही कहा।
Image