వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీలు భర్తీలో ప్రతిభే గీటురాయి .



వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీలు  భర్తీలో ప్రతిభే గీటురాయి . 

* దళారులను ఆశ్రయించి మోసపోవద్దు : 

* ప్రలోభపరిచే వారి సమాచారాన్ని మాకు అందించండి: 

* ఆలా సమాచారం అందించే వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం :

* పోస్టుల కోసం లంచం ఇవ్వడం, తీసుకోవడం కూడా నేరమే: 

* పోస్టుల కోసం లంచం ఇచ్చేందుకు పాల్పడే వారిని అనర్హుల జాబితాలో పెడతాం.. 

 .... *జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న  వెంకటేష్* .... 



  ఏలూరు, ఆగష్టు, 23 (ప్రజా అమరావతి): జిల్లాలోని  వైద్య ఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీని ప్రతిభ ఆధారంగా పారదర్శకంగా చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ ఒక ప్రకటనలో చెప్పారు.  జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖలో వివిధ విభాగాలలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందన్నారు.  అభ్యర్ధులకు సంబంధించిన విద్యార్హత మార్కులు మరియు కోవిడ్ సమయంలో వారు అందించిన సేవలు ఆదారంగా మెరిట్ జాబితాను రూపొందించడం జరుగుతుందన్నారు.  ఈ మెరిట్ జాబితాను ప్రజల సందర్శనార్థమై జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఏలూరు నందు నోటీసు బోర్డులలో ప్రదర్శించడం జరుగుతుందని, దీనితో పాటు www.eluru.ap.gov.in  మరియు www.westgodavari.ap.gov.in  వెబ్ సైట్ లలో కూడా ఉంచడం జరుగుతుందని కలెక్టర్ చెప్పారు.   జాబితాలో అభ్యంతరాలు, ఆక్షేపణలు ఉంటె ఆధారాలతో సహా  అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు.  అనంతరం తుది జాబితా విడుదల చేయడం జరుగుతుందన్నారు.  


ఖాళీల భర్తీ ని అభ్యర్థుల ప్రతిభే ప్రాతిపదికగా పూర్తి పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుందని,  అభ్యర్థులు మధ్యదళారుల వలలో పడి  మోసపొవద్దని హితవు పలికారు. పోస్టుల కోసం లంచం ఇచ్చినా, తీసుకున్నా నేరమని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.  పోస్టుల కోసం అడ్డదారుల్లో ప్రయత్నించేవారిని అనర్హులుగా పరిగణించడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు.  పోస్టుల భర్తీకి దళారులెవరైనా ప్రలోభపెడితే వెంటనే జిల్లా కలెక్టర్ కార్యాలయం ఫోన్ నెంబర్ 7901525354  లేదా టోల్ ఫ్రీ నెంబర్ 14400 లకు ఫోన్ చేసి తెలియజేయాలని, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలియజేసారు. . 


Comments