అమరావతి (ప్రజా అమరావతి);
మంగళగిరి పట్టణంలోని టిప్పర్ల బజార్ లో సంజీవని ఉచిత ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.
నియోజకవర్గంలో పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు ప్రారంభమైన సంజీవని ఆరోగ్య కేంద్రం.
ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రుల చుట్టూ తిరిగలేని..., డబ్బు ఖర్చు చేయలేని నిరుపేదలు, మధ్య తరగతి ప్రజల కోసం సంజీవని ఆరోగ్య కేంద్రం.
ఆరోగ్య కేంద్రం లో అత్యాధునిక చికిత్స పరికరాలు, పరీక్ష యంత్రాలు, ఎమర్జెన్సీకి అవసరమైన సామాగ్రిని తన సొంత ఖర్చులతో సమకూర్చిన లోకేష్.
ఒక జనరల్ ఫిజిషియన్ అయిన డాక్టర్, క్వాలిఫైడ్ ఫార్మసిస్ట్, ఫిమేల్ నర్స్, కాంపౌండర్.
ఆరోగ్య కేంద్రంలోనే 200కి పైగా రోగనిర్దారణ పరీక్షలు కూడా పూర్తిగా ఉచితంగా చేసే ఏర్పాటు.
అవసరమైనవారికి మందులు కూడా ఉచితంగా అందజేత.
అందరికీ ఆరోగ్యమస్తు- ప్రతీ ఇంటికీ శుభమస్తు అనే నినాదంతో అందుబాటులోకి వచ్చిన ఆరోగ్య కేంద్రం.
*10వ తరగతి పాస్ డిగ్రీ ఫెయిల్ అయిన తెలివితేటలు జగన్మోహన్ రెడ్డివి*
*జగన్మోహన్ రెడ్డికి టైం అయిపోయింది. ఇంటికెళ్లే సమయం దగ్గర పడింది.
*జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు ఏమి లేవు. రాష్ట్రం నుండి వెళ్లిపోయిన పరిశ్రమలు తప్ప.
*పెట్టుబడులు పెట్టాలంటే సీఎంవోలో వాటా ఎంత ఇవ్వాలి అనే చర్చే జరుగుతోంది*
*గత 3ఏళ్లలో రాష్ట్రానికి తెచ్చిన పరిశ్రమలపై శ్వేతపత్రం విడుదల చేస్తే చర్చకు సిద్ధo*
*జగన్మోహన్ రెడ్డి రిబ్బన్ కటింగ్ చేస్తున్న ప్రతీ పరిశ్రమా తెలుగుదేశం ప్రభుత్వ కృషే*
*తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 5లక్షల ఉద్యోగుల కల్పన జరిగిందని జగన్ ప్రభుత్వమే ఒప్పుకుంది*
*దాదాపు 500 హామీలు ఇచ్చి మాట తప్పి మడమ తిప్పిన జగన్మోహన్ రెడ్డిని 175 నియోజకవర్గాలు గెలిపించాలా?*
*ఈడీ, ఐటీ, సీబీఐ భయంతో ఢిల్లీలో మెడలు వంచుతున్న జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఏం సాధించారు*
*జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఓ పెద్ద కుంభకోణం వచ్చేవారం బయటపెట్టబోతున్నా*
ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నాం.
మంగళగిరిలో విజయవంతం అయిన కార్యక్రమాలు అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తాం.
addComments
Post a Comment