నెల్లూరు (ప్రజా అమరావతి)!
అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అమలు
చేస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
మంగళవారం సాయంత్రం సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని, వెంకటాచలం మండలం వీరన్న కనుపూరు గ్రామంలో చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డికి పెద్ద ఎత్తున మహిళలు, అభిమానులు, ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లిన మంత్రి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు అందుతున్నాయా లేదా తెలుసుకుంటూ, ఏమైన సమస్యలు వుంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ప్రతి కుటుంబాన్ని కలుసుకోవడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వారికి వివరించి, వారు పొందుతున్న లబ్ధి సమాచారంతో కూడిన బుక్ లెట్‌ను అందజేశారు.
ఈ సంధర్బంగా మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, గడపగడపకు మన ప్రభుత్వం అనే వినూత్నమైన కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి వారు పొందిన సంక్షేమ పథకాలను వివరించి, వారు తెలిపిన సమస్యలను అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. గతంలో ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు కొందరికే అందేవని, ముఖ్యమంత్రిగా శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని మంత్రి తెలిపారు. నివేశన స్థలం, ఇల్లు మంజూరు, వివిధ సంక్షేమ పథకాలు ద్వారా ప్రతి లబ్ధిదారునికి సుమారు 5 లక్షల రూపాయల వరకు లబ్ది చేకూరుచున్నదని మంత్రి తెలిపారు. సాంకేతిక కారణాలతో అర్హత ఉండి కూడా సంక్షేమ పథకాలు అందని పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాల ప్రయోజనాన్ని అందించడమే ఈ కార్యక్రమంలో ప్రధాన ఉద్దేశం అన్నారు. సచివాలయం, వాలంటీర్ వ్యవస్థను ప్రవేశ పెట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేయడం పట్ల ప్రజలు తమ సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని మంత్రి తెలిపారు.
మంత్రి వెంట తహశీల్దార్ శ్రీ నాగరాజు, ఎంపిడిఓ శ్రీమతి సుస్మిత, ఎంపిటిసి శ్రీ పి. మస్తానయ్య, గ్రామ సర్పంచ్ శ్రీ నాటకం శ్రీనివాసులు, ఉప సర్పంచ్ శ్రీ సి.హెచ్ ప్రభాకర్ , వివిధ శాఖల మండల అధికారులు, ప్రజా ప్రతినిధిలు, వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment