*గృహనిర్మాణశాఖపై సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష.*
*నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంపై క్యాంప్ కార్యాలయంలో సీఎం సమీక్ష.*
అమరావతి (ప్రజా అమరావతి);
*ఈ సందర్బంగా సీఎం ఏమన్నారంటే...:*
గృహనిర్మాణ పనులు వేగవంతంగా ముందుకు సాగాలి:
నవరత్నాలు –పేదలందరికీ ఇళ్లు కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత నివ్వాలి:
చేసిన పనులకు నిధులుకూడా సక్రమంగా విడుదల చేస్తున్నాం:
విశాఖలో ఇచ్చిన ఇళ్ల నిర్మాణపనులు కూడా వేగంగా జరగాలి:
విశాఖపట్నంలో ఇచ్చిన 1.24 లక్షల ఇళ్ల నిర్మాణ పనులకు అన్నిరకాలుగా సిద్ధంచేస్తున్నామన్న అధికారులు:
అక్టోబరు చివరినాటికి ఇళ్ల నిర్మాణం ప్రారంభమవుతుంది:
వీటి నిర్మాణం వేగంగా సాగేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం.
ఆప్షన్ మూడు కింద ఎంపిక చేసుకున్న ఇళ్ల నిర్మాణాలూ కూడా వేగంగా సాగుతున్నాయన్న అధికారులు
ఇళ్ల నిర్మాణంతోపాటు... కాలనీల్లో సమాంతరంగా మౌలిక సదుపాయాల కల్పనా పనులపైన దృష్టిపెట్టాలని సీఎం ఆదేశం.
డ్రైనేజీ, నీళ్లు, కరెంటు వంటి మౌలిక సదుపాయాల కల్పన జరగాలన్న సీఎం.
కాలనీల్లో పనుల ప్రగతి సమీక్షించడానికి, సందేహాల నివృత్తికి వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాన్ని అక్కడనుంచే ఏర్పాటు చేశామన్న అధికారులు
ప్రత్యేకించి ఒక పోన్ నంబర్‌ను కూడా అందుబాటులో ఉంచాలన్న సీఎం.
*టిడ్కో ఇళ్ల నిర్మాణ ప్రగతినీ సమీక్షించిన సీఎం*
15–20 రోజుల్లో మొత్తం 1.4 లక్షల ఇళ్లు సర్వం సిద్ధం అవుతున్నాయని తెలిపిన అధికారులు.
పూర్తి మౌలిక సదుపాయాలతో లబ్ధిదారులకు ఇళ్లు అందించాలన్న సీఎం
రిజిస్ట్రేషన్ల ప్రక్రియనూ వేగవంతం చేయాలన్న సీఎం.
టిడ్కో ఇళ్ల నిర్వహణపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాలన్న సీఎం.
వీటి నిర్వహణ బాగుండేలా మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులకు ఆదేశం:
*90 రోజుల్లో ఇంటిపట్టా కార్యక్రమాన్ని సమీక్షించిన సీఎం.*
వచ్చిన దరఖాస్తులను పరిష్కరించి 2,03,920 మందిని కొత్తగా తేల్చామన్న అధికారులు
వీరిలో ఇప్పటికే లక్షమందికి పట్టాలు అందించామన్న అధికారులు.
మిగతావారికీ అందించడానికి అన్ని ఏర్పాట్లు చేశామన్న అధికారులు.
పట్టా ఇవ్వడమే కాదు, లబ్ధిదారుని స్థలం ఎక్కడ ఉందో కూడా చూపించాలన్న సీఎం.
ఈ సమీక్షా సమావేశానికి ఎపీఎస్‌హెచ్‌సీఎల్ ఛైర్మన్ డి దొరబాబు, సీఎస్ సమీర్ శర్మ, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్షి, ఇంధనశాఖ స్పెషల్ సీఎస్ కె విజయానంద్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, ఏపీఎస్‌హెచ్‌సీఎల్ ఎండీ ఎన్ భరత్ గుప్తా, సీసీఎల్‌ఎ కార్యదర్శి అహ్మద్ బాబు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
addComments
Post a Comment