విజయవాడ (ప్రజా అమరావతి);
* అర్హత గల 5196 మంది పాస్టర్ లకు గౌరవ వేతనంగా ఒక్కొక్కరికీ రూ. 5 వేల రూపాయలు చొప్పున విడుదల..
* కులాలు, మతాలు, వర్గాలు, రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం సంక్షేమ పాలన అందిస్తున్నది..
* ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాల కాలంలో అన్నివర్గాల ప్రజలనూ సంక్షేమ గొడుగులోనికి తెచ్చి ఆదుకున్నది..
* అర్చకులు, ఇమాం మౌజం లతో పాటుగా దైవ జనులందరికీ నేడు గౌరవ వేతనం విడుదల..
* రాష్ట్రంలో పాస్టర్ లకు గౌరవ వేతనం అందించేందుకు నేడు రూ. 2 కోట్ల 59 లక్షలు విడుదల..
* కోవిడ్ విపత్తు సమయంలో సైతం సంక్షేమ పధకాలను ఆపకుండా జగనన్న ప్రభుత్వం ఆదుకున్నది..
- రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి శ్రీ అంజాద్ బాషా..
రాష్ట్రంలో అర్చకులు, ఇమాం మౌజం లతో పాటుగా నేడు మొదటి విడతలో 5196 మంది పాస్టర్ లకు నెలకు రూ. 5 వేల రూపాయలు చొప్పున గౌరవ వేతనంగా అందించేందుకు నిధులు విడుదల చేశామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి శ్రీ అంజాద్ బాషా అన్నారు. విజయవాడ గురునానక్ కాలనీ లోని ప్రైడ్ మాధవా హోటల్లో గురువారం రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి శ్రీ అంజాద్ బాషా ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంజాద్ బాషా మాట్లాడుతూ మొదటి విడతలో పేర్కొన్న జాబితా ఆధారంగా పాస్టర్ లకు బ్యాంకు ఖాతాలలో నేడు నగదు సొమ్ము జమచేయడం జరిగిందని మంత్రి అన్నారు. రాష్ట్రంలో అర్హత కలిగిన పేద ప్రజలందరికీ సంక్షేమ కార్యక్రమాలను రూపొందించి అమలు చేసే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పని చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో, అంకిత భావంతో అనేక సంక్షేమ పధకాలను అమలు చేస్తున్నదన్నారు. మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవగాహనా సదస్సులు ఏర్పాటు చేసి అర్హత కలిగిన లబ్దిదారులను గుర్తించి గౌరవ వేతనం ఇచ్చామని మైనారిటీ వెల్ఫేర్ పోర్టల్ ను విస్తరించి ఇంకనూ మిగిలిన అర్హత కలిగిన పాస్టర్ లు అందరికీ గౌరవ వేతనం రెండవ పర్యాయంలో విడుదల చేయడానికి సైతం చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో మతసామరస్యమును పెంపొందించి సమాజాన్ని ఉత్తమ మార్గంలో నడిపిస్తూ, శాంతి భద్రతలను పర్వవేక్షిస్తూ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సుపరిపాలనను అందిస్తున్నదని శ్రీ అంజాద్ బాషా అన్నారు. అర్చకులు, ఇమాం మౌజం లతో పాటుగా పేదవర్గాల ప్రజలైన సోదర పాస్టర్ లను గౌరవించి ఆదుకోవాలన్న పవిత్ర లక్ష్యంతో నేడు వారి ఆత్మభిమానం పెంపొందించే విధంగా ప్రభుత్వం గౌరవ వేతనం విడుదల చేయడం ప్రభుత్వ విజయంగా మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం సంక్షేమ క్యాలెండర్ ను రూపొందించి ఆయా తేదీలు వారీగా నిర్దారించబడిన సంక్షేమ పధకాలను క్రమం తప్పకుండా అమలు చేసి ప్రభుత్వ పరిపాలన గాడిలో పెట్టి ముందుకు నడిపిస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందని మంత్రి అన్నారు. అర్హత కలిగిన పాస్టర్ లను గుర్తించేందుకు వారిని గౌరవ వేతనం పరిధిలోనికి తెచ్చేందుకు నియమ నిబంధనలను సరళీకృతం చేసి ప్రభుత్వ జి. ఓ. ను విడుదల చేసి మరింత మందికి గౌరవ వేతనం అందించేందుకు మైనారిటీ సంక్షేమ శాఖ కృతనిశ్చయంతో పనిచేస్తున్నదని మంత్రి అంజాద్ బాషా అన్నారు.
సోషల్ జస్టిస్ అడ్వైసర్ శ్రీ జూపూడి ప్రభాకర రావు మాట్లాడుతూ సామజిక స్పృహ, ప్రేరణ, పవిత్రత కలిగిన దేవుని సందేశాన్ని సమాజంలోని పేద ప్రజలందరికీ అందిస్తూ సమాజానికి మేలు చేసే బాధ్యత కలిగిన టీచర్స్ గా పాస్టర్స్ పనిచేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని మైనారిటీ ప్రజలలో అత్యధిక భాగం కలిగిన పాస్టర్స్ కు ప్రభుత్వం గౌరవ వేతనం విడుదల చేయడం శుభ పరిణామం అని ప్రభాకర రావు అన్నారు.
ఈ కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మల్లాది విష్ణు వర్ధన రావు, శాసన సభ్యులు శ్రీ ఎలియా, క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ డా. జాన్ వెస్లీ, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ ఏ. ఎండి. ఇంతియాజ్, మైనారిటీ సంక్షేమ శాఖ సంచాలకులు డా. జి. సి. కిషోర్, వక్ఫ్ సర్వే కమిషనర్ శ్రీమతి షరీన్ బేగం, క్రిస్టియన్ కార్పొరేషన్ కు చెందిన పలువురు డైరెక్టర్ లు, వివిధ క్రిస్టియన్ సంఘాలకు చెందిన ప్రతినిధులు, పాస్టర్లు, రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment