శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి

 శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి


, విజయవాడ (ప్రజా అమరావతి): 

      

        ఈరోజు అనగా ది.15-08-2022 న 75వ స్వాతంత్ర్య  దినోత్సవ సందర్భముగా ఆజాదీ కా అమృత్ మహిత్సవములలో  భాగంగా విధి నిర్వహణ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం సన్మానించుటలో భాగంగా శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ గారిని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ అధికారిణి గా గుర్తించి, పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు  గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ శ్రీ ఢిల్లీ రావు, IAS గారు మరియు పోలీస్ కమీషనర్ శ్రీ కాంతి రాణా టాటా, IPS గారి చేతుల మీదుగా ఉత్తమ అధికారిణి గా ప్రశంసా పత్రమును అందజేయడం జరిగినది. 

   ఈ సందర్భంగా ఆలయ అధికారులు మరియు సిబ్బంది అందరూ ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ గారిని అభినందించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

Comments