మహిళల ఆత్మగౌరవం పెంపొందించేలా చర్యలు తీసుకోండి

 *మహిళల ఆత్మగౌరవం పెంపొందించేలా చర్యలు తీసుకోండి*  *గవర్నర్ కు వినతి పత్రం సమర్పించిన అఖిల పక్షనేతలు* 


మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా సమాజంలో చోటు చేసుకుంటున్న సంఘటనలపై తగిన చర్యలకు ఆదేశించాలని కోరుతూ మహిళా సంఘాల ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ వినతి పత్రం ఇచ్చారు. శుక్రవారం రాజ్ భవన్ లో గౌరవ గవర్నర్ ను కలిసిన మహిళా ప్రతినిధులు మహిళల అభిమానాన్ని దెబ్బతీసేలా ఇటీవల జరిగిన పలు సంఘటనలను గురించి వివరించారు. పార్లమెంటు సభ్యుల నగ్న వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయని  గవర్నర్ కు వివరించారు. ఈ వీడియోకు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని, ఎవ్వరూ ఫిర్యాధు చేయలేదంటూ దాటవేస్తున్నారని పేర్కొన్నారు. సుమెటోగా కేసు నమౌదు చేసేలా పోలీసు శాఖను ఆదేశించాలని, నగ్నవీడియోలపై వాస్తవాలు వెలికి తీసి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. మహిళలు సమాజంలో తలెత్తుకుని తిరిగేలా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని విన్నవించారు. గవర్నర్ ను కలిసిన వారిలో డిగ్నిటీ ఫర్ ఉమెన్ కన్వీనర్ డాక్టర్ సిహెచ్ కీర్తి, తెలుగు దేశం మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సమన్వయ కర్త సుంకర పద్మశ్రీ , ఆంధ్రమహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి దుర్గా భవాని, జనసేన నుండి సౌమ్య, ఇతర సంఘాల నుండి మాలతి, రమాదేవి, గంగా భవాని, శ్రావణి, జ్యోతి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మహిళా ప్రతినిధులు గవర్నర్ కు రాఖీలు కట్టి ఆశీర్వచనం తీసుకున్నారు.

Comments