జోగి రమేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రతినిధులు.


పెడన (ప్రజా అమరావతి);రాష్ట్ర మంత్రి  శ్రీ జోగి రమేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రతినిధులు.ఈరోజు పెడన మంత్రిగారి కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్య శిక్షణ కేంద్రం [స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థ] ప్రతినిధులు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామాత్యులు శ్రీ జోగి రమేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి అతి త్వరలో కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న నైపుణ్య శిక్షణ కేంద్రాలు ద్వారా 22 ప్రముఖ కంపెనీలు నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశం కల్పించే విధంగా భారీ జాబ్ మేళా అతి త్వరలో నిర్వహించనున్నట్లు తెలియజేశారు.*


ఈ సందర్భంగా  మంత్రివర్యులు శ్రీ జోగి రమేష్  నైపుణ్య శిక్షణ కేంద్రం అధికారులతో మాట్లాడుతూ బంటుమిల్లి డిగ్రీ కళాశాలలో కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుచేసి విద్యార్థులకు తగిన శిక్షణ ఇవ్వాల్సిందిగా సూచించగా, అధికారులు అతి త్వరలో బంటుమిల్లి డిగ్రీ కళాశాల సందర్శించి నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


మంత్రి శ్రీ జోగి రమేష్ గారిని కలసి, వారికి పుష్పగుచ్ఛం అందించిన వారిలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కు చెందిన జిల్లా అధికారి శ్రీ ఎస్. శ్రీనివాసరావు, ప్లేస్మెంట్ ఎగ్జిక్యూటివ్ శ్రీ మధు కుమార్, పెడన నియోజకవర్గం కోఆర్డినేటర్ శ్రీ వి.అవధాని బాబు ఉన్నారు.

Comments