నేడు హోం మంత్రి స్థానంలో ఒక మహిళ ఉన్నా మహిళలకు న్యాయం సున్నా

 


మంగళగిరి (ప్రజా అమరావతి);


నేడు హోం మంత్రి స్థానంలో ఒక మహిళ ఉన్నా మహిళలకు న్యాయం సున్నా


.

 తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్(రాజ) విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ... 

 రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? లేదా? అనే అనుమానం కలుగుతోంది. 

 వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ షో వీడియో వెలువడి 5 రోజులైనా చర్యలు శూన్యం. 

 వీడియో చూసినవారు సిగ్గుతో తల దించుకుంటున్నారు. 

 తెలుగు జాతి గౌరవాన్ని మంటగలిపారు. 

 తెలుగు జాతి యావత్తు సిగ్గు పడుతున్నా జగన్ రెడ్డికి చీమ కుట్టినట్లుగాకూడ లేదు.  వైసీపీ నాయకులకు సిగ్గుగా లేదంటే ఇంతకన్నా దుర్మార్గం మరొకటి లేదు.  మహిళలను అవమానపరచడం వైసీపీ మంత్రులు, శాసన సభ్యులకు  అలవాటుగా మారింది. 

 ఎన్ని సార్లు ఎంత మందిని అవమాన పరిచినా చర్యలు శూన్యం.    ప్రతి పక్షహోదాలో బాధ్యత గల నాయకులు ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తుంటే వారిపై కేసులు పెట్టి అరెస్ట్ లు చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపించిన సంఘటనలు అనేకం. 

 ఈ విషయం ఏపి క్రైం బ్యూరోనే చెబుతోంది. 

 మూడు సంవత్సరాల్లో 17వేల కేసులు నమోదయ్యాయి.

 ఈకేసుల్లో పాత్ర ధారులు, సూత్రధారులు, ముద్దాయిలు  వైసీపీ నాయకులు, కార్యకర్తలే. 

 తెలిసి కూడ వారిపై ఎటువంటి చర్యలు లేవు.  

 ప్రతిపక్షాలపై దాడులు జరుగుతున్నా, అనేక మందిపై హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నా ఎంత మందిపై న్యాయపరంగా వ్యవహరిస్తున్నారు? 

 నేడు గోరంట్ల మాధవ్ సభ్యసమాజం సిగ్గుపడేలా వ్యవహరించినా నిమ్మకు నీరెత్తినట్లున్నారు.పార్లమెంటు ఎంతో ఉన్నతమైంది. అందులో వై.యస్. రాజశేఖర్ రెడ్డి, నీలం సంజీవ రెడ్డి, ఎన్.జి. రంగా,  ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు లాంటి గొప్పవాళ్లు కూర్చున్న గొప్ప సభ. అలాంటి ఉత్తమ పార్లమెంటులో ఎంపీగా కొనసాగే వ్యక్తి తెలుగు జాతి సిగ్గుపడే విధంగా ప్రవర్తించారు.

 యావత్తు మహిళా లోకం తలదించుకొనే విధంగా ప్రవర్తించినా వైసీపీ ప్రభుత్వానికి చీమ కుట్టనట్టుగా కూడా లేదు. 

 ముఖ్యమంత్రి తీరు దున్నపోతుపై వాన కురిసినట్టుంది. 


 శాంతి భద్రతలను కాపాడాల్సిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. 


అధికారంలో ఉన్న పార్టీ పై తొడ కొట్టాడని గోరంట్ల మాధవ్ పై గతంలో 302, 376 కేసులు ఉన్నా.. వాటిని పక్కన పెట్టి ముఖ్యమంత్రి గోరంట్ల మాధవ్ కు ఎంపీ సీటు  ఇచ్చారు. వారికి ప్రమోషన్లు ఇచ్చి మీ ఇష్టమోచ్చినట్టు వ్యవహరించండంటూ స్వేచ్ఛ ఇచ్చారు. దీంతో అత్యాచారాలు, దాడులు పెరిగాయి. వైసీపీలో దాదాపు 87 మంది నేర చరిత్ర కలిగి ఉన్నారని నేషనల్ క్రైం బ్యూరో రిపోర్ట్ లో వెల్లడయింది. మహిళల ఆత్మ గౌరవానికి భంగం కలిగించిన ఘటనలు దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ లో జరిగాయని NCRB  నివేదిక పేర్కొంది. 

 దేశంలో మహిళలపై జరుగుతున్న భౌతిక దాడుల్లో మొదటి స్థానం, మహిళల అక్రమ రవాణాలో 2వ స్థానం, ఎస్సీలపై జరుగుతున్న దాడుల్లో 5వ స్థానం,  మహిళలపై జరగుతున్న లైంగిక వేధింపు ఘటనల్లో 2వ స్థానంలో రాష్ట్రాన్ని నిలిపిన ఘనత జగన్ రెడ్డిదే. 

 జగన్ రెడ్డి అనాలోచిత, దుర్మార్గపు నిర్ణయాలతో రఘురామకృష్ణంరాజును గోరంట్ల మాధవ్ చే కొట్టించడానికి జగన్ ప్రయత్నించారో ఆనాడే దీనికి నాంది పలికింది. 

 ఏం చేసినా, ఎలా ప్రవర్తించినా, ఏ తప్పు చేసినా జగన్ రెడ్డి ప్రభుత్వం వాళ్లకి కొమ్ము కాస్తుంది అనే భావన వైసీపీ నాయకుల్లో ఉంది. 

 అరగంట, గంట రమ్మనే మంత్రులు ఉన్నప్పుడు మహిళలకు ఏం గౌరవం లభిస్తుంది?

 మహిళా సభ్యురాలిని హోం మంత్రిని చేశామని జగన్ గొప్పలు చెప్పుకుంటున్నారు. 

 నేడు హోం మంత్రి స్థానంలో ఒక మహిళ ఉన్నా మహిళలకు న్యాయం సున్నా. 

 అత్యాచారం జరిగిన ప్రదేశానికి  హోం మంత్రి వెళ్లలేని పరిస్థితి ఉంది. నిబంధనలతో కూడిన హోం మంత్రి పదవిని కట్టబెట్టిన అసమర్థ ప్రభుత్వం జగన్ రెడ్డిది. 

 నేడు మహిళా కమీషన్,  డిజీపీ ఎక్కడ ఉన్నారు? 

న్యాయాన్ని పరిరక్షించాలనే భావన నేడు రాష్ట్రంలా ఎక్కడా కానరావడంలేదు. ఇదేనా జగన్ రెడ్డి పాలన? స్త్రీలకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? 

 అధికారంలోకి వచ్చిన తరువాత దశల వారి మద్యపాన నిషేదం విధిస్తామని, ఏ మహిళ పుస్తెలు తెగకూడదని, ఏ మహిళ  కన్నీటి బొట్టు నేల రలకూడదని చెప్పి నేడు మద్యపాన నిషేదంపై మాట తప్పి మడమ తిప్పారు. 

 రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు యువత బానిసైంది.  మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారు.  కుల చిచ్చు పెడుతున్నారు. 

 గోరంట్ల మాధవ్ న్యూడ్ షో చేస్తే కమ్మవారు చేయించారని మాట్లాడుతున్నారు. ఇంతకన్నా సిగ్గుమాలిన చర్య ఇంకొకటి లేదు. మద పిచ్చితో రెచ్చిపోతున్న వ్యక్తి  వార్డు మెంబరుగా కూడ పనికి రాని వ్యక్తిని పార్లమెంటు మెంబరుగా చేశారు. ప్రజలపైకి అచ్చోసిన ఆబోంతులా వదిలారు. 

మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని ఖండించకుండా, అతని ఎంపీ పదవిని రద్దు చేయకుండా, రాజీనామా చేయమని ప్రశ్నించకుండా కాలపాయన చేస్తున్నారు.కులం కార్డు ఉపయోగించే దుర్మార్గం జగన్ రెడ్డిలో ప్రబలిపోయింది. ఇటువంటి జగన్ రెడ్డి పాలన ఒక్కనిమిషం కూడ సాగనివ్వకూడదు. ఫోరెన్సిక్ ల్యాబ్ కి రిపోర్ట్ పంపించడం అనేది బూటకం. 

డిజిటలైజేషన్, అడ్వాన్సడ్ టెక్నాలజీలు వచ్చిన తరువాత ప్రపంచంలో ఎక్కడికి రిపోర్టుని పంపించినా అరగంట, గంటలోనే నివేదిక వచ్చే పరిస్ధితులు ఉన్నాయి. 

ముఖ్యమంత్రికి దమ్ము, ధైర్యం ఉంటే సెంట్రల్ డిజిటల్ లైబ్రరీ హైదరాబాద్, బొంబాయి, ఢిల్లీ, చెన్నైలలో ఏదో ఒకదానికి పంపి నిర్ధారణ చేసుకోవాలి.  ప్రజా ప్రతినిధులతో కూడిన కమిటీ, పత్రికలతో కూడిన కమిటీ, అడ్వయిజరీ కమిటీకి రిఫర్ చేసి గోరంట్ల మాధవ్ వీడియో మార్ఫియింగా, ఒరిజనలా అని నిర్ధారణకు రావాలని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్(రాజ) విలేఖరుల సమావేశంలో పేర్కొన్నారు.

Comments