సచివాలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన సిఎస్ డా.సమీర్ శర్మ

 సచివాలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన సిఎస్ డా.సమీర్ శర్మ


అమరావతి,15 ఆగష్టు (ప్రజా అమరావతి):భారత స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకుని సోమవారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకు వద్ద జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు.ముందుగా ఎస్పిఎఫ్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన తదుపరి జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.అనతంరం మువ్వన్నెల జాతీయ జెండాను ఎగురవేశారు.అనంతరం సిఎస్.డా. సమీర్ శర్మ మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సందర్భంగా ముందుగా వివిధ అధికారులు సిబ్బంది వారి కుటుంబ సభ్యులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్ర్య దినోత్సవ వేళ ప్రతి ఒక్కరూ ఆనాటి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.రాష్ట్రానికి,దేశానికి వివిధ విధానాలు రూప కల్పనలో చిన్న చిన్న ఉద్యోగుల కృషి ఎంతో ఉంటుందని అన్నారు.ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పధకాలను గ్రామ స్థాయి వరకూ తీసుకువెళ్ళి ప్రతి ఒక్క లబ్దిదారునికి అందించుటలో ఉద్యోగులు కీలకపాత్ర పోషించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ సూచించారు.

ఈకార్యక్రమంలో రాష్ట్ర ఐటి శాఖ కార్యదర్శి సౌరవ్ గౌర్,ఇఏ టు సిఎస్ అపరాజిత శనీశ్వర్, సచివాలయం సిఎస్ఓ కె.కృష్ణమూర్తి,సచివాలయ డిప్యూటీ సెక్రటరీ రామసుబ్బయ్య, సచివాలయ ఉద్యోగుల సంఘం అద్యక్షులు వెంకట్రామిరెడ్డి,సచివాలయం అధికారులు, సిబ్బంది,ఎస్పి ఎఫ్ పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

అనంతరం వివిధ చిన్నారులు,ఇతర ఉద్యోగులకు సిఎస్.డా.సమీర్ శర్మ మిఠాయిలు పంపిణీ చేశారు.

  

Comments