అభివృద్ధి పనులను గౌరవ మంత్రి వర్యులు, ప్రజా ప్రతినిధుల సమక్షంలో ప్రారంభించేందుకు ఏర్పాట్లురాజమహేంద్రవరం (ప్రజా అమరావతి): 
గురువారం ఉదయం రూడా కార్యాలయ పరిధిలో సమావేశ మందిరం ను ప్రారంభించడం, ఇతర అభివృద్ధి పనులను గౌరవ మంత్రి వర్యులు, ప్రజా ప్రతినిధుల సమక్షంలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసినట్లు  రూడా చైర్ పర్సన్ మెడపాటి షర్మిలా రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం రూడా వెబ్ సైట్ ను ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఆజాద్ చౌక్ వద్ద క్లాక్ టవర్ ప్రారంభించడం జరుగుతుంది. రూడా పరిధిలో చేపట్టిన సుందరీ కరణ పనుల్లో భాగంగా కోరుకొండ రోడ్  ఏయీర్ పోర్ట్ ప్రధాన ద్వారం వద్ద చేపట్టి పూర్తి చేసిన గ్రీనరీ, ల్యాండ్ స్కైప్ లను ప్రారంభిస్తామని తెలిపారు.


అనంతరం రూడా ఆధ్వర్యంలో  టిటిడి రోడ్ లో నిర్మించిన జగనన్న ఊమెన్ సేఫ్ హెవెన్ .. బస్ షెల్టర్ ను ప్రారంభిస్తున్నట్లు తెలియచేశారు.

అనంతరం  టిటిడి కళ్యాణ మండపం లో బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు ఆమె తెలియచేశారు.


ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా ఇంఛార్జి మంత్రి చెల్లు బోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ, హోం మంత్రి డా . తానేటి వనిత, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, పార్లమెంట్ సభ్యులు మార్గని భరత్ రామ్, శాసన సభ్యులు జక్కంపూడి రాజా , తదితరులు పాల్గొననున్నారని రూడా వైస్ చైర్మన్ వి. వివేక్ తెలియచేశారు.Comments